Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఐపీఎల్‌లో నేడు ముంబైతో తలపడనున్న పంజాబ్‌.. పుణె వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌

* హైదరాబాద్‌లో ఇవాళ బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49 వేలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,450, కిలో వెండి ధర రూ.72,700

* నేడు అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నేడు నాంపల్లి కోర్టు తీర్పు.

* ఏపీ: కృష్ణా జిల్లాలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ పర్యటన.. పెనమలూకు నియోజకవర్గం వణుకూరులోని ఆర్బీకే సెంటర్‌ను సందర్శించనున్న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్.

* తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటల సమయం, నేటి నుంచి ఈ నెల 17 వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

* మంచిర్యాల: నేటి నుంచి ప్రాణహిత పుష్కరాలు.. ఈనెల 24 తేదివరకు కొనసాగనున్న పుష్కర స్నానాలు.. ఇవ్వాళ మధ్యాహ్నం అర్జున గుట్ట ఘాట్ వద్ద పుష్కర స్నానం ఆచరించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. ప్రాణహిత జన్మస్థానం కొమురం భీం జిల్లా తుమ్మడి హాట్టి వద్ద, మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట, రాపనపల్లి, కోటపల్లిలలో పుష్కర ఘాట్లు ఏర్పాటు

* నేడు సీపీఎం గ్రేటర్ విశాఖ ప్లీనరీ సమావేశం… హాజరుకానున్న రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

* విజయవాడ – విశాఖపట్నం మధ్య ఉదయ్ డబుల్ డెక్కర్ రైళ్లు… రెండేళ్ల తర్వాత సర్వీసులు పునరుద్ధరణ

* నేడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ లో పర్యటించనున్న నారా లోకేష్ …

* నేడు తెనాలిలో మంత్రి మేరుగ నాగర్జున పర్యటన… మంత్రిగా తెనాలిలో తొలి పర్యటన సందర్బంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్న వైసీపీ శ్రేణులు

* నేడు బాపట్ల మండల పరిధిలో నూతనంగా నిర్మించిన పలు సచివాలయాలను ప్రారంచించనున్న ఉప సభాపతి కోన రఘుపతి

* తిరుమలలో రేపటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు.. మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

* గుంటూరు జిల్లా నకరికల్లులో నేడు వాలంటీర్ల సత్కారసభలో పాల్గొనున్న మంత్రి అంబటి రాంబాబు

* విజయనగరం: డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి తొలి సారి జిల్లాకి వస్తున్న పీడిక రాజన్నదొర.

* నేడు కర్నూలు జిల్లా మద్దికేరలో ఆపద్బాంధవ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం

Exit mobile version