Chinnaswamy Stadium Stampede: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడగా.. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, మృతుల్లో నలుగురు మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు తెలుస్తుంది. స్టేడియంలోకి ఒక్కసారిగా భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు దూసుకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
Read Also: Broccoli Superfood: బ్రోకలీ తినడం వల్ల నిజంగానే బరువు తగ్గవచ్చా..?
కాగా, స్టేడియం గేట్ వద్ద ఉన్న పైకప్పు కూలడంతో తొక్కిసలాట స్టార్ట్ అయిందని తెలుస్తుంది. ఒక్కసారిగా అభిమానులు స్టేడియంలోకి దూసుకురావడంతో పోలీసులు వారిని అదుపు చేయలేక పోయారు. ఈ క్రమంలో లాఠీచార్జ్ చేయగా.. ఈ సందర్భంగా స్టేడియాన్ని ఖాళీ చేయాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారికి సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. బాధితులను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పరామర్శించారు.
Read Also: Off The Record: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే సీన్ ఉందా..? అన్ని వట్టి మాటలేనా..?
అయితే, మధ్యాహ్నం 3 గంటల 49 నిమిషాలకు ఆర్సీబీ జట్టు బెంగళూరుకు చేరింది. ఇక, సాయంత్రం 4:47 గంటలకు విధాన సభ ప్రాంగణానికి ఆర్సీబీ వెళ్లింది.. 5:10కి భారీ వర్షంలోనే ఆర్సీబీ టీమ్‌కు సత్కారం కొనసాగింది. 5:16 గంటలకి చిన్నస్వామి స్టేడియం దగ్గర లాఠీచార్జ్ జరిగింది. దీంతో 5:16 నిమిషాలకు అభిమానులు భారీ కేడ్లు దూకడంతో తొక్కిసలాట ప్రారంభమైంది. 5:30 గంటలకి ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆరా తీశారు. 5:47కి స్టేడియం వద్దకు ఆంబులెన్స్ చేరుకున్నాయి. సాయంత్రం 5:50 గంటలకి ఎనిమిది మంది చనిపోయినట్లు ప్రకటన వెల్లడించింది. 5:53 నిమిషాలకు బెంగళూరు పోలీసులు చేతులెత్తేశారు. సాయంత్రం 6:01 గంటలకి 11 మంది చనిపోయినట్లు ప్రకటన విడుదల చేశారు.
