Site icon NTV Telugu

PM Modi Speech: ప్రధాని మోడీ ‘‘ఆపరేషన్ సిందూర్’’ స్పీచ్‌పై ప్రపంచ మీడియా ఏం చెప్పిందంటే..

Pm Modi

Pm Modi

PM Modi Speech: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై సోమవారం ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రసంగం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ దానికే బలవుతుందని అన్నారు. మరోసారి, భారత్‌పై ఉగ్రవాద దాడులు జరిగితే దానిని తీవ్రంగా ప్రవర్తిస్తామని ప్రధాని మోడీ పాకిస్తాన్‌కి వార్నింగ్ ఇచ్చారు. న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్‌ని ఇక సహించేది లేదని చెప్పారు. ఇది యుద్ధాల యుగం కాదంటూనే, ఇది ఉగ్రవాదుల యుగం కూడా కాదని చెప్పారు. అయితే, ప్రధాని మోడీ ప్రసంగాన్ని ప్రపంచ మీడియా విస్తృతంగా కవర్ చేసింది. ప్రధాని మోడీ చేసిన కామెంట్స్‌ని హైలెట్ చేసింది.

* వాషింగ్టన్ పోస్ట్ ప్రధానమంత్రి ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ, భారతదేశం తన సైనిక చర్యను “పాజ్” చేసిందని మరియు భవిష్యత్తులో దేశంపై ఏదైనా ఉగ్రవాద దాడి జరిగితే “తన స్వంత నిబంధనలపై ప్రతీకారం తీర్చుకుంటుందని” ఇస్లామాబాద్‌కు ఆయన హెచ్చరికను హైలైట్ చేసింది.

* యూకే పత్రిక ది గార్డియన్ కూడా ఇదే ప్రకటనను హెడ్‌లైన్‌గా చేసింది. అణు ముప్పుపై ప్రధాని ప్రతిస్పందనను హైలెట్ చేసింది. పాకిస్తాన్‌తో భవిష్యత్తులో ఏదైనా వివాదంలో, భారత్‌ని ‘‘అణు బ్లాక్‌మెయిల్’’‌ని సహించదని పేర్కొంది.

* బీబీసీ ‘‘ రక్తం, నీరు కలిసి ప్రవహించదు’’ అని ప్రధాన చేసిన వ్యాఖ్యల్ని ప్రధానంగా ప్రస్తావించింది. భవిష్యత్తులో ఏదైనా దాడి జరిగితే పాకిస్తాన్‌కి బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించినట్లు చెప్పింది. ఇది యుద్ధాల యుగం కాదు, అలాగే ఇది ఉగ్రవాద యుగం కాదని చెప్పిన ప్రధాని మోడీ కామెంట్స్‌ని ప్రస్తావించింది.

* జపాన్ టైమ్స్ కూడా ప్రధాని మోడీ ప్రసంగాన్ని కవర్ చేసింది. ‘‘ఉగ్రవాదంపై కొత్త మార్గాన్ని, న్యూ నార్మల్ స్థితి’’ని మోడీ నిర్దేశించారని చెప్పింది. అణు బెదిరింపులు, పాక్‌తో చర్చల్లో ఉగ్రవాదం, కాశ్మీర్‌పైనే దృష్టి పెడుతుందని మోడీ చెప్పినట్లు కవర్ చేసింది.

* పాకిస్తాన్ సమా టీవీ మోడీ చెప్పిన విషయాలను విస్తృతంగా కవర్ చేసింది. ఆపరేషన్ సిందూర్ కేవలం నిలిపివేయబడిందని, ముగియలేదని మోడీ హెచ్చరికల్ని హైలెట్ చేసింది. పాక్ అణు బ్లాక్‌మెయిల్‌పై ఇక భారత్ పట్టించుకోదనే ప్రధాని ప్రకటనని ప్రముఖంగా ప్రస్తావించింది.

Exit mobile version