Saina Nehwal: కాంగ్రెస్ ఎమ్మెల్యే ‘‘వంటగది’’ వ్యాఖ్యలపై సైనా నెహ్వాల్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saina Nehwal: బీజేపీ నేత గాయత్రి సిద్దేశ్వరపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మహిళల్ని తక్కువగా చూపించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై పలువురు సెలబ్రెటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు వంటింటికే పరిమితం కావాలని 92 ఏళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని బ్యాట్మింటన్ స్టాన్ సైనా నెహ్వాల్ ఖండించారు. ఇలాంటి దృక్కోణాల నుంచి బయటపడాలని సూచించారు.
Read Also: Pakistan: చుక్కల్ని అంటుతున్న పెట్రోల్ ధరలు.. లీటర్ రూ. 290
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
‘‘మహిళల్ని వంటింటికే పరిమితం చేయాలి-ఇది కర్ణాటక అగ్రనేత షామనూర్ శివశంకరప్ప జీ చెప్పిన మాట. బీజేపీ దావణగెరె అభ్యర్థి గాయత్రి సిద్దేశ్వరని ఉద్దేశించి చేసిన సెక్సిస్ట్ వ్యాఖ్యలు’’ లడ్కీ హూ, లడ్ శక్తి హూ అని చెప్పే పార్టీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఆశించలేము అని కాంగ్రెస్‌ని ఉద్దేశించి ఎక్స్ వేదికగా సైనా ట్వీట్ చేశారు. ‘‘ నేను మైదానంలో భారత్ తరుపున పతకాలు గెలిచినప్పుడు, నేను ఏం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇష్టపడుతోంది..? అని ఎద్దేవా చేశారు. ‘‘ అమ్మాయిలు, ఆడవాళ్లందరూ తమకు నచ్చని ఏ రంగంలోనైనా పెద్ద విజయాలు సాధించాలని కలలు కంటున్నప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు అంటున్నారు..? ఒక వైపు నారీశక్తిని గౌవిస్తున్నాం, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. మరో వైపు నారీశక్తిని, స్త్రీలపై ద్వేషపూరితంగా వ్యాఖ్యలు చేస్తూ అగౌరపరుస్తుండటంతో నిజంగా కలత చెందుతున్నాను’’ అని సైనా ఆవేదన వ్యక్తం చేశారు.
దావణగెరె సౌత్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివశంకరప్ప కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఆయన కోడలు ప్రభా మల్లికార్జున్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. బీజేపీ అభ్యర్థి గాయత్రి సిద్దేశ్వరని విమర్శిస్తూ మహిళలు వంటింటికే పరిమితం కావాలని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన గాయత్రి సిద్దేశ్వర.. ‘‘ఈ రోజు ఆడవాళ్లు ఏ వృత్తిలో లేరు..? ఆకాశంలో కూడా ఎగురుతున్నాం. ఆడవాళ్లు ఎంత అభివృద్ధి చెందారో ఆ ముసలివాడికి తెలియదు, ఆడవాళ్లందరూ ఇంట్లో మగవాళ్లకు, పిల్లలకు, పెద్దవాళ్లకు ఎంత ప్రేమతో వంట చేస్తారో తెలియదు’’ అని స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశారు.
“Woman should be restricted to the kitchen"- This is what a top Karnataka leader Shamanur Shivashankarappa ji has said . This sexist jibe at @bjp4india candidate from Davanagere Gayathri Siddeshwara ji is least expected from a party that says Ladki Hoon Lad Sakti Hoon
When I…
— Saina Nehwal (@NSaina) March 30, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!