Leader Of Opposition: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి ఎలాంటి అధికారాలు ఉంటాయి..? జీతం ఎంత..?
- 10 ఏళ్ల తర్వాత లోక్‌సభలో ప్రతిపక్ష నేత..
- ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ..
- ప్రతిపక్ష నేత అధికారులు
- జీతం వివరాలు..
- పలు కమిటీల్లో కీలకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leader Of Opposition: 10 ఏళ్ల తరువాత తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత వచ్చారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంది. సాధారణంగా లోక్‌సభలోని మొత్తం స్థానాల్లో 10 శాతం సీట్లు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఈ సారి కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.
పార్లమెంటు చట్టం, 1977లో ప్రతిపక్ష నాయకుల జీతాలు మరియు అలవెన్సుల ప్రకారం రాహుల్ గాంధీ జీతం పొందుతారు. అనేక సౌకర్యాలను కలిగి ఉంటారు. ప్రతిపక్ష నేత సభలో ఎడమ వైపు ముందు వరసలో కూర్చుంటారు. గాంధీ కుటుంబంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల తర్వాత ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు.
Also Read
ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అధికారాలు..?
10 ఏళ్ల తర్వాత తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్ష నేతను చూస్తున్నాం. ప్రతిపక్ష పాత్ర లేకుండా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారుతుంది. రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ మంత్రి హోదా, జీతం, అలవెన్స్ లభిస్తాయి. జీతం రూ. 3.3 లక్షలు లభిస్తుంది. కేబినెట్ మంత్రికి ఉండే భద్రత కల్పిస్తారు. ఇందులో Z+ సెక్యూరిటీ కూడా ఉంటుంది. కేబినెట్ మంత్రి తరహా ప్రభుత్వ బంగ్లా ఉంటుంది.
ప్రధాన ఎన్నిక కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించే త్రి సభ్య ప్యానెల్‌లో రాహుల్ గాంధీ ఇప్పుడు మూడో సభ్యుడిగా ఉంటారు. సీబీఐ, ఈడీ, సీవీసీ వంటి కేంద్ర సంస్థల చీఫ్‌లను ఎంపిక చేసే కమిటీలో సభ్యుడిగా రాహుల్ గాంధీకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. త్రి సభ్య కమిటీని ప్రధాని నరేంద్రమోడీ లీడ్ చేస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటారు. వీరిని ప్రధాని సిఫారసు చేస్తారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!