Site icon NTV Telugu

Siddaramaiah: నా రాజీనామా అడిగే హక్కు ఆయనకు లేదు..

Siddharamaiah

Siddharamaiah

Siddaramaiah: కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కార్ అవినీతి పాలన కొనసాగిస్తుంది.. తక్షణమే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని.. ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత యాడ్యూరప్ప చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచాయి. అయితే, ఈ వ్యాఖ్యలను కన్నడ సీఎం తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా యాడ్యూరప్పపై ఉన్న కేసులను గుర్తు చేశారు. తన రాజీనామా అడిగే హక్కు ఆయనకు లేదని సిద్ధరామయ్య అన్నారు.

Read Also: Bangladesh protests: ప్రధాని అధికారిక నివాసంలో వస్తువులు లూటీ.. ఫర్నీచర్, చికెన్ అపహరణ

అయితే, మాజీ సీఎం యాడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. యాడ్యూరప్పపై ఫోక్సో కేసుతో పాటు ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా..? అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండవచ్చా అని ప్రశ్నించారు. నా రాజీనామా అడిగేందుకు ఆయనకు ఏ నైతిక హక్కు ఉంది..? ఆయనపై ఇప్పటికే చార్జిషీట్‌ దాఖలైంది.. కోర్టు బెయిల్‌ ఇచ్చింది కాబట్టి బయట తిరుగుతున్నారు.. లేదంటే ఫోక్సో కేసులో జైలులో ఉండేవారు అంటూ సీఎం మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోని 21 కేసులపై తాము విచారణకు ఆదేశించాం.. ఆదే విధంగా మిగతా కేసులలో కూడా ఎంక్వైరీకి ఆదేశిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.

Exit mobile version