Site icon NTV Telugu

West Bengal: టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారు.. మిథున్ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు..

Mithun Chakraborty

Mithun Chakraborty

Mithun Chakraborty comments on TMC: బీజేపీ నేత, సినీ నటుడు మిథున్ చక్రవర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)పై విమర్శలు గుప్పించారు. గత జూలైలో మిథున్ చక్రవర్తి.. టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. తాజాగా మరోసారి ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. తాను జూలైలో చేసి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మిథున్ చక్రవర్తి అన్నారు. టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని..వారిలో 21 మంది నేరుగా తనతో కాంటాక్ట్ లో ఉన్నారని చెప్పారు.

గతంలో నేను చేసిన వ్యాక్యలపై నిలబడతానని.. అయితే కొంత సమయం వేచి ఉండండి.. మీరే చూస్తారని చేరికల గురించి అన్నారు. టీఎంసీ నాయకులను చేర్చుకోవడంపై పార్టీలో అభ్యంతరం ఉందని వెల్లడించారు. చాలా మంది బీజేపీ నాయకులు కుళ్లిన బంగాళాదుంపలను తీసుకోమని టీఎంసీ నాయకుల గురించి అంటున్నారని మిథున్ చక్రవర్తి అన్నారు. దీనికి ముందు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ ఆరు నెలల్లో టీఎంసీ అధికారం కోల్పోతుందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి వ్యాఖ్యానించారు. ఈడీ, సీబీఐ అవినీతిపై విచారణ జరుపుతున్నాయని.. టీఎంసీ డిసెంబర్ లోపు అధికారాన్ని కోల్పోతుందని గతంలో మేదినీపూర్ లో సువేందు కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గృహనిర్బంధం?.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తలు

ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ తరుపున స్టార్ క్యాంపెనర్ గా ఉన్నారు మిథున్ చక్రవర్తి. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ మెజారిటీ సీట్లను సాధించింది. మరోసారి మమతా బెనర్జీ సీఎం పదవిని చేపట్టారు. మొత్తం 294 స్థానాల్లో టీఎంసీ 213 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ 77 సీట్లను సాధించింది. ఎన్నికల అనంతరం బెంగాల్లో భారీగా హింస చెలరేగింది. టీఎంసీ, బీజేపీ నాయకులే టార్గెట్ గా దాడులు, హత్యలకు పాల్పడ్డారు.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 23న మాల్డాలోని మాలతీపూర్ ప్రాంతంలో మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు మౌసుమీ దాస్ ఇంటిపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారుని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వ్యాక్యలను టీఎంసీ తోసిపుచ్చింది. బీజేపీ నేతలే.. తమపై దాడులకు పాల్పడుతున్నారని టీఎంసీ అధికార ప్రతినిధి షువోమోయ్ బసు వ్యాఖ్యానించారు.

Exit mobile version