Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్‌లో హోరాహోరీ పోరు!
- పశ్చిమ బెంగాల్‌లో అధికారం ఎవరిది
- ఉత్కంఠగా మారిన సర్వే సంస్థల అంచనాలు
- బీజేపీ, తృణమూల్ మధ్య నెక్ టు నెక్ ఫైట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Election Results: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో చారిత్రక మలుపు రాబోతోందా.. దశాబ్దాల పాటు ‘ఎరుపు’ (లెఫ్ట్) జెండా రెపరెపలాడిన ఈ గడ్డపై, ఆ పార్టీలను గద్దె దించి అధికారంలోకి వచ్చారు.. ఆ రాష్ట్ర ప్రజలు ముద్దుగా దీదీగా పిలుచుకునే మమతా బెనర్జీ. గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ కోటగా ఉన్న బెంగాల్, ఇప్పుడు ‘కాషాయం’ వైపు మొగ్గు చూపుతోందా.. 2026 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే బెంగాల్ గడ్డపై హోరాహోరీ పోరు సాగినట్లు స్పష్టమవుతోంది. ఇంతకీ ఈ దఫా అధికార పగ్గాలను చేజిక్కించుకునేది ఎవరనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిరేపుతుంది.
పశ్చిమ బెంగాల్ పీఠం ఎవరిది? మమతా బెనర్జీ హ్యాట్రిక్ తర్వాత తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేక బీజేపీ చారిత్రక విజయాన్ని నమోదు చేయబోతోందా? తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ బెంగాల్ ఫలితాలపై ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మెజారిటీ సర్వేలు బీజేపీ – తృణమూల్ కాంగ్రెస్ (TMC) మధ్య ‘నెక్-టు-నెక్’ ఫైట్ ఉంటుందని తేల్చి చెబుతున్నాయి.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే..
బెంగాల్‌లోని 294 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరనేది ఉత్కంఠగా మారింది. పలు సర్వే సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి..
JVC సర్వే: బీజేపీకి 138-159 స్థానాలు, టీఎంసీకి 131-152 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక్కడ బీజేపీకి స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది.
P-MARQ: బీజేపీ 150-175 స్థానాలతో స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని, టీఎంసీ 118-138 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది.
Matrize: బీజేపీకి 146-161 (42.5% ఓట్లు), టీఎంసీకి 126-135 (40.8% ఓట్లు) వస్తాయని అంచనా వేసింది.
Poll Diary: బీజేపీకి 142-171, టీఎంసీకి 99-127 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
అయితే People’s Pulse మాత్రం ఇందుకు భిన్నంగా మమతా బెనర్జీకి తిరుగులేదని, టీఎంసీ 177-187 స్థానాలతో భారీ విజయం సాధిస్తుందని, బీజేపీ 95-110 స్థానాలకే పరిమితమవుతుందని జోస్యం చెప్పింది.
కాషాయ దళం దూకుడు.. డిఫెన్స్‌లో దీదీ !
2016లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ, 2021 నాటికి 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇప్పుడు 2026లో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సువేందు అధికారి నాయకత్వంలో బీజేపీ ఉత్సాహంగా పరుగులు పెడుతుంది. ముఖ్యంగా ఉత్తర బెంగాల్, జంగల్‌మహల్ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉండగా.. ఇదే సమయంలో మమతా బెనర్జీ తన 15 ఏళ్ల పాలనపై ధీమాగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆమె కొట్టిపారేస్తూ, టీఎంసీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
మే 4న భవితవ్యం
2021 ఎన్నికల్లో సుమారు 35 నియోజకవర్గాల్లో గెలుపోటములు 5,000 కంటే తక్కువ ఓట్ల తేడాతోనే జరిగాయి. ఈసారి కూడా అతి తక్కువ ఓట్ల శాతం అటు ఇటూ అయినా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వల్ప ఓట్ల తేడా కూడా సీట్ల సంఖ్యలో భారీ మార్పులకు కారణం కావచ్చు వారు చెబుతున్నారు. ఎరుపు జెండాల స్థానంలో పచ్చ తోరణాలు వచ్చి చేరిన బెంగాల్ గడ్డపై, ఇప్పుడు కాషాయ జెండాలు రెపరెపలాడుతాయా? లేకపోతే మళ్లీ మమతా బెనర్జీ పార్టీ జెండాలే కనబడుతాయా? అనేది మే 4న వెలువడే ఫలితాలతో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!