Mamata Banerjee: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనకు బీజేపీ కుట్ర..
- బెంగాల్‌లో టెన్షన్ టెన్షన్..
- మల్దా ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనకు బీజేపీ కుట్ర చేస్తుందని మమతా విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: ఎన్నికల ముందు బెంగాల్ రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. మాల్దా జిల్లాలో న్యాయాధికారులను గంటల తరబడి బంధించడంపై సుప్రీంకోర్టు రాష్ట్రాన్ని తీవ్రంగా మందలించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో పేర్లను తొలగించడంపై మొదలైన వివాదం ముట్టడి వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఈ ఘటనపై తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తూ.. పశ్చిమ బెంగాల్ రాజకీయంగా అత్యంత విభజించబడిన రాష్ట్రంగా పేర్కొంది. మాల్దా జిల్లాలోని ఒక గ్రామంలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) పై పని చేస్తున్న న్యాయాధికారులపై జరిగిన దాడి అనంతరం సుప్రీంకోర్టు ఈ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
Read Also: Iran: ‘‘మా భారత మిత్రులు సురక్షితం, ఆందోళన అవసరం లేదు’’.. ఇరాన్ మెసేజ్..
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
ఈ ఘటనపై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. సాగర్‌దిఘిలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. ఈ ఘటనతో ప్రభుత్వానికి సంబంధం లేదని, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో ఆగ్రహావేశాలే దీనికి కారణమని ఆమె పేర్కొన్నారు. న్యాయాధికారుల్ని ముట్టడించిన వ్యక్తులు ఎవరో తనకు తెలియదని, నా చేతిలో ఎలాంటి అధికారము లేది, శాంతిభద్రతలతో సహా అన్ని అధికారాలను వారు లాగేసుకున్నారని ఆమె అన్నారు. మాల్దాలో జరిగిన ఘటన బీజేపీ కుట్రలో భాగమని ఆమె ఆరోపించారు. ఓటమి భయంతో ఈ నెలలో జరగాల్సిన ఎన్నికల్ని రద్దు చేయింది, బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ప్లాన్ చేస్తోందని మండిపడ్డారు.
ఎన్నికల సంఘంపై విమర్శలు చేస్తూ.. శాంతిభద్రతల్ని తమ నియంత్రణలో ఉంచుకోవాలని భావించి, చివరకు విఫలమయ్యారని, న్యాయాధికారులకు రక్షణ కల్పించలేకపోయారని అన్నారు. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందువల్ల న్యాయాధికారులకు భద్రత కల్పించడం ఈసీ బాధ్యత అని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. బెంగాల్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు లక్షలాది మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంపై బెంగాల్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఈ నేపథ్యంలో ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ప్రలోభాలకు లొంగొద్దని ఆమె కోరారు.
తాజావార్తలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!