West Bengal: దిగిపోయిన దీదీ.. రాబోతున్న బీజేపీ! మే 9న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..
- తృణమూల్ 15 ఏళ్ల పాలనకు ముగింపు
- 206 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ
- సీఎం అభ్యర్థిగా సువేందు అధికారి పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన భారతీయ జనతా పార్టీ (BJP), మే 9వ తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య మంగళవారం వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీలో ఇంకా అంతర్గత చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే పేరును ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంతో పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘకాలంగా సాగిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) పాలనకు తెరపడింది.
కేంద్రం – రాష్ట్రంలో ఒకే పార్టీ
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 206 స్థానాల్లో గెలుపొంది, మూడింట రెండొంతుల మెజారిటీని సాధించింది. ప్రతిష్టాత్మకమైన భవానీపూర్ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఘనవిజయం సాధించారు. 1972 తర్వాత బెంగాల్‌లో కేంద్రంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలోనూ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. దీనివల్ల రాష్ట్ర పరిపాలనలో, రాజకీయ సమీకరణాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయోత్సవాల అనంతరం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. బెంగాల్ భయం నుంచి విముక్తి పొందిందని ఆయన అన్నారు. “బెంగాల్‌లో దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయ హింసా సంస్కృతికి నేటితో ముగింపు పడాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రతీకారం కాదు, మార్పు. భయం గురించి కాదు, భవిష్యత్తు గురించి చర్చ జరగాలి” అని ప్రధాని పిలుపునిచ్చారు. రాజకీయ హింసను వీడి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకే ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
తాజావార్తలు
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!