NTV Telugu Site icon

హస్తినలో దీదీ ఐదు రోజుల టూర్‌.. ప్రధానితో భేటీ..!

Mamata Banerjee

Mamata Banerjee

ఐదు రోజుల పర్యటన కోసం మమత బెనర్జీ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ టూర్‌లో విపక్ష నేతలతో పాటు.. ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. జులై 28న ప్రధాని మోడీని, రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ను కలవనున్నారు మమతా బెనర్జీ.. అయితే, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి బీజేపీ వర్సెస్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ గా మారింది పరిస్థితి.. ప్రధాని మోడీని దీదీ టార్గెట్‌ చేస్తే… దీదీపై ప్రధాని హాట్‌ కామెంట్లు చేసిన సందర్భాలు లేకపోలేదు.. ఈ పరిస్థితుల్లో.. ప్రధాని మోడీ – మమతా బెనర్జీ భేటీ జరుగుతుందా? ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది ఆసక్తిగా మారింది.