ప్రధాని మోడీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమావేశం అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో సువేందు అధికారి 45 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.
పశ్చిమ బెంగాల్ అభివృద్ధి, కేంద్ర నిధులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, పరిపాలనా విషయాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా రాష్ట్రానికి మరింత సహకారం అందించాలని ప్రధాని మోడీని సువేందు అధికారి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ భేటీ రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే భేటీ అనంతరం అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికాలేదు. ఇక మోడీతో భేటీ అనంతరం హోంమంత్రి అమిత్ షాను కూడా సువేందు కలిశారు. వివధ అంశాలపై చర్చించారు.
West Bengal Chief Minister Suvendu Adhikari met Prime Minister Narendra Modi in Delhi
(Source: BJP West Bengal) pic.twitter.com/Na7mj9PBFI
— ANI (@ANI) May 22, 2026
West Bengal Chief Minister Suvendu Adhikari met Union Home Minister Amit Shah in Delhi
(Source: Amit Shah/X) pic.twitter.com/jgDJf0c03m
— ANI (@ANI) May 22, 2026

