NTV Telugu Site icon

Karnataka: ‘‘ఇజ్రాయల్’’ ట్రావెల్స్ ‘‘జెరూసలెం’’గా మారింది.. ఓ వర్గం అభ్యంతరం పేరు మార్పు..

Karnataka

Karnataka

Karnataka:కర్ణాటకలోని ‘‘ఇజ్రాయిల్’’ ట్రావెల్స్ అనే ట్రావెల్ కంపెనీ ఇప్పుడు తన పేరుని ‘‘జెరూసలెం’’ ట్రావెల్స్‌గా మార్చుకుంది. మిడిల్ ఈస్ట్‌లోని ఇజ్రాయిల్-హమాస్, హిజ్బుల్లా యుద్ధాలు కర్ణాటకలో కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఓ వర్గం వారు ఇజ్రాయిల్ ట్రావెల్స్ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్-పాలస్తీనా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చర్చనీయాంశం అవుతున్న వేల, ఈ ఇజ్రాయిల్ ట్రావెల్ ఉన్న బస్సు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై కేసు పెట్టాలని పోలీసుల్ని కోరారు.

Read Also: Ram Nath Kovind: “వన్ నేషన్ వన్ ఎలక్షన్” రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుంది?

దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఈ ట్రావెల్స్ యజమాని లెస్టర్ కటీల్ మీడియాతో మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా తాను ట్రావెల్ ఏజెన్సీలో ఇజ్రాయిల్‌కి పనిచేసినందుకు ఆ దేశంపై అభిమానంతో పేరు పెట్టానని తెలిపారు. తాను ఇండియా రాక ముందు ఇజ్రాయిల్‌లో పలు హోదాల్లో పనిచేసినట్లు చెప్పాడు. తాను ట్రావెల్ కంపెనీ ప్రారంభించినప్పుడు ఇజ్రాయిల్ పేరు పెట్టినట్లు వెల్లడించారు. కొన్ని వర్గాల వారు దీనిపై ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో తెలియదని, నాకు ఉపాధి అందించిన దేశంపై గౌరవంతో ఆ పేరు పెట్టానని చెప్పుకొచ్చారు.

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మతపరంగా చాలా సున్నితమైంది. గతంలో హిజాబ్‌ నిరసనలతో పాటు పలువురు హిందూ కార్యకర్తల హత్యలు కూడా జరిగాయి. ఇజ్రాయిల్ పేరుపై సోషల్ మీడియాలో హంగామా మొదలు కావడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో లెస్టర్ తన ట్రావెల్ కంపెనీ పేరుని ‘‘జెరూసలెం’’గా మార్చారు.

Show comments