Caste Census: కులగణనపై ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు.. ఓకే, కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Caste Census: వచ్చే ఏడాది జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో ‘కులగణన’ అంశం కీలకంగా మారబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ దీనిపై స్పష్టంగా వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడుతామంటూ ప్రకటించారు. మరోవైపు ప్రజలను కులాలు, మతాల పేరుతో కాంగ్రెస్ వేరు చేసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ మండిపడుతోంది. ఇదిలా ఉంటే కులగణనపై బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ స్పందించింది.
గురువారం రోజున ఆర్ఎస్ఎస్ కులగణనకు షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది. శాస్త్రీయంగా, ఎన్నికల ప్రయోజనాల కోసం కాకండా నిర్వహించే ఏదైన నిశ్చయాత్మక చర్యను స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతల్లో ఒకరైన శ్రీధర్ గాడ్గే స్పందిస్తూ.. కులగణన కొంతమందికి రాజకీయ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని కారణంగా దానికి తన వ్యతిరేకత ప్రకటించానని, దాని వల్ల ఆచరణాత్మక ఉపయోగం లేదని అన్నారు.
Also Read
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
Read Also: Jammu Kashmir: పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి.. ముగ్గురు జవాన్లు మృతి
కులగణనను సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించాలని మా అభిప్రాయమని, ఈ కసరత్తు చేస్తున్న సమయంలో సామాజిక సామరస్యం, ఐక్యత దెబ్బతినకుండా చూసుకోవాలని, ఆర్ఎస్ఎస్ కూడా హిందూ సమాజం కోసం పనిచేస్తుందని ఈ రోజు ప్రకటనలో వెల్లడించింది.
గత కొన్ని వారాలుగా దేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కులగణన అంశాన్ని తెరపైకి తెచ్చింది. కొన్ని రోజుల క్రితం బీహార్ రాష్ట్రం కులగణన నిర్వహించి, డేటాను కూడా విడుదల చేసింది. 65 శాతం రిజర్వేషన్లు పెంచాలని అక్కడి అసెంబ్లీలో బిల్లును కూడా ఆమోదించింది. ఇండియా కూటమి కూడా ఇదే విధంగా కులగణన నిర్వహించాలని బీజేపీని డిమాండ్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో కులగణన చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే కులగణన ప్రాతిపదికన కాంగ్రెస్ ప్రచారం చేసినప్పటికీ.. తెలంగాణ మినహా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!