NTV Telugu Site icon

UP: పెళ్లి కారు బీభత్సం.. బైక్, ఆటో ఢీ.. వీడియో వైరల్

Caraccident

Caraccident

ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. రాయ్‌బరేలిలోని లక్నో-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై ఉంచహార్ మార్కెట్ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఓ పెళ్లి కారు బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న వ్యక్తులు.. ఎగిరి ఆటోపై పడ్డారు. కారు మాత్రం ఆపకుండా వెళ్లిపోయాడు. అనంతరం హనుమాన్ ఆలయం సమీపంలో మరో పాదచారి మొహమ్మద్ కలీమ్‌ను ఢీకొట్టాడు. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇక స్థానికులు కారు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Rajendra Prasad: ‘రాబిన్ హుడ్’తో నితిన్ రేంజ్ మారుతుంది.. భలే గమ్మత్తుగా ఉంటుంది!

డెకరేషన్‌తో ముస్తాబైన ఓ పెళ్లి కారు. వరుడిని తీసుకొచ్చేందుకు వెళ్తోంది. మార్చి 2న (ఆదివారం) లక్నో-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై ఉంచహార్ మార్కెట్ ప్రాంతంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అంతే ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టాడు. బైక్‌పై ఉన్న వ్యక్తులు ఎగిరి.. ఆటోపై పడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ప్రమాదం చేసిన కారును, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయ్‌బరేలీ పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Ragging Cases: పెరుగుతున్న ర్యాగింగ్ కేసులు.. పరిష్కారం కోసం కేరళ హైకోర్టు ప్రత్యేక బెంచ్‌