NTV Telugu Site icon

UP: వీడేం పెళ్లికొడుకు.. వధువు స్నేహితురాలి మెడలో దండేసిన వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే..!

Upwedding1

Upwedding1

పెళ్లంటే ఎంత సంతోషం.. ఉల్లాసం ఉంటుంది. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారంటే.. అబ్బాయి-అమ్మాయికి ఎన్నో ఊహాలు ఉంటాయి. భార్యాభర్తలు అయ్యాక.. ఎన్నో ప్రణాళికలు.. ఎన్నో కలలు ఉంటాయి. అలాంటిది పెళ్లి కాక ముందే.. ఓ వరుడు చేసిన పనులకు వధువు అసహ్యించుకుని పెళ్లి పీటల మీద నుంచి దిగి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది.

ఇది కూడా చదవండి: Pakistan : పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎందుకు సోమవారం బ్లాక్ డేగా మారింది ?

బరేలీలో 26 ఏళ్ల యువకుడు రవీంద్ర కుమార్, 21 ఏళ్ల యువతి రాధా దేవికి వివాహం నిశ్చియమైంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల రాకతో మండపం అంతా ఉల్లాసంగా.. సంతోషంగా ఉంది. అయితే పెళ్లికొడుకు రవీంద్ర కుమార్.. తన గ్రామమైన నౌఘ్వా భగవంత్‌పూర్ నుంచి వచ్చే ముందు స్నేహితులతో కలిసి ఫుల్‌గా మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులోనే పెళ్లి మండపానికి వచ్చాడు. అయితే పెళ్లి వేదికపై దండలు మార్చుకునే సమయం వచ్చినప్పుడు.. వరుడు రవీంద్ర కుమార్.. పెళ్లికూతురు మెడలో దండ వేయకుండా.. ఆమె స్నేహితురాలి మెడలో దండ వేశాడు. ఈ పరిణామంతో రాధ దేవితో పాటు.. అతిథులంతా షాక్ అయ్యారు. కనీసం రవీంద్ర కుమార్ స్పృహ లేడు.. ఏం చేస్తున్నాడో అతడికే అర్థం కాలేదు. వెంటనే దండ తీసి.. మరొకరి మెడలో దండ వేశాడు. దీంతో పెళ్లికూతురు నిశ్చేష్టురాలై.. పెళ్లికొడుకును చెంప దెబ్బ కొట్టి పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయింది.

ఇక పెళ్లికూతురు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. వరుడు రవీంద్ర కుమార్‌ను అరెస్ట్ చేశారు. వరకట్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే వివాహ ఏర్పాట్ల కోసం రూ.10లక్షలు ఖర్చు చేసినట్లు రాధా దేవి సోదరుడు ఓంకార్ వర్మ తెలిపాడు. కట్నం పట్ల వరుడు అసంతృప్తిగా ఉన్నాడని.. ఆ ఉద్దేశంతోనే ఇలా చేశాడని వాపోయాడు. ఇక రవీంద్ర కుమార్ తన వృప్తి పట్ల కూడా తప్పుడు సమాచారం ఇచ్చాడని పేర్కొన్నారు. ఇక వరుడు రవీంద్ర కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పరీక్షించగా మద్యం మత్తులో ఉన్నట్లుగా నిర్ధారించారు. అయితే తప్పైందని వరుడు క్షమాపణ చెప్పినా.. పెళ్లి చేసుకునేందుకు వధువు అంగీకరించలేదు. దీంతో పెళ్లి రద్దైంది.

ఇది కూడా చదవండి: Shashi Tharoor: కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో శశిథరూర్ సెల్ఫీ.. హస్తానికి బై చెప్పినట్టేనా..!