NTV Telugu Site icon

Anand Mahindra: “అరేయ్ నువ్వు చెప్పినట్లు చేస్తే, నా కంపెనీ దివాళా తీయడం ఖాయం”.. పిల్లాడి వీడియోపై ఆనంద్ మహీంద్రా..

Anand Mahindra

Anand Mahindra

Anand Mahindra: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. వర్తమాన వ్యవహారాలు, వైరల్ వీడియోలపై ఆయన స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఓ పిల్లాడి వీడియోను పోస్ట్ చేశారు. ‘‘పిల్లాడు చెప్పినట్లు చేస్తే తన కంపెనీ దివాళా తీస్తుందని’’ ఫన్నీగా ట్వీట్ చేశారు.

మహీంద్రా థార్, XUV 700 కార్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. బుక్ చేస్తే కొన్ని నెలలకు కూడా కస్టమర్ల చేతిలోకి రావడం లేదు. అంత డిమాండ్ ఉంది ఈ రెండు కార్లు. అయితే ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన వీడియోలో ఓ పిల్లాడు అమాయకంగా.. తన తండ్రితో థార్, XUV 700 కార్లను కొనాలనే కోరికను వ్యక్తం చేశాడు. రెండింటిని కొనేందుకు రూ.700 సరిపోతాయని పిల్లాడు అమాయకంగా చెప్పడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రాను కూడా ఆకర్షించింది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. తమ కంపెనీ థార్‌ని రూ.700కి విక్రయిస్తే, మేము త్వరలోనే దివాళా తీస్తామని ఫన్నీగా చమత్కరించారు.

Read Also: Ajit Pawar: ప్రధాని మోడీకి ప్రత్నామ్నాయం లేదు.. ఎన్సీపీ అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు..

‘‘ మా ఫ్రెండ్ సోని తారాపోరేవాలా నాకు ఈ వీడియోను పంపారు. ఐలవ్ యూ చీకూ.. నేను అతని వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను. అతనిని ప్రేమిస్తున్నాను. నా సమస్య ఏంటంటే.. మేను థార్‌ని 700 రూపాయలకు అమ్మితే మేము చాలా త్వరలోనే దివాళా తీస్తాము’’ అని కామెంట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అమాయక బాలుడి కోరికను నెరవేర్చమని అభ్యర్థించారు. మరికొందరు రూ. 700లకు థార్ లేదా XUV 700 బొమ్మకారును ఇవ్వాలని కోరారు. సార్.. పిల్లావాడి కోరిక నెరవేరేలా అతనికి బహుమతి ఇవ్వాలి, అతనికి శాంటాగా ఉండండి అంటూ మరొకరు కోరారు.