NTV Telugu Site icon

Gyanvapi Mosque case: “విజయం అంచున ఉన్నాం”.. జ్ఞానవాపి నివేదికపై హిందూ తరపు న్యాయవాది

Gynavapi

Gynavapi

Gyanvapi Mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐఏ) సర్వే నివేదిక వచ్చిన తర్వాత.. తాము విజయానికి చేరువలో ఉన్నామంటూ హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గురువారం అన్నారు. ఏఎస్ఐ సర్వే నివేదిక వాజుఖానాలోని ఉన్నది శివలింగమా..? లేక ఫౌంటైనా.? అనేది తేలుస్తుందని ఆయన చెప్పారు. ‘‘వాజుఖనాలోని బావిలోని చేపలు చనిపోవడంతో వాటిని క్లీనింగ్ కోసం కోర్టులో దరఖాస్తు చేశాము. ఇక్కడ కూడా ఏఎస్ఐ సర్వే కోసం సుప్రీం కోర్టులో దరఖాస్తు చేస్తాం. సర్వేపై స్టే తొలగించాలని కోరాము. ప్రస్తుతం దీని కస్టడీ వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ వద్ద ఉంది. ఏఎస్ఐ నివేదిక వచ్చిన తర్వాత మేము విజయం అంచున ఉంటామని నేను చెప్పగలను’’ అని ఆయన అన్నారు.

Read Also: Nani: బలగం వేణు దర్శకత్వంలో రెండో సినిమాకి నాని గ్రీన్ సిగ్నల్?

జ్ఞాన్వాపి మసీదు అక్రమ ఆక్రమణ నుంచి విముక్తి పొందే రోజు మనం చూడగమని విష్ణు శంకర్ జైన్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఏఎస్ఐ తన నివేదికను గురువారం బహిరంగపరచాలని హార్డ్ కాపీని ఇరు వర్గాలకు అందించాలని వారణాసి జిల్లా కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. కోర్టు ఆదేశాల తర్వాత హిందూ న్యాయవాది హరిశంకర్ జైన్ మాట్లాడుతూ.. ‘‘మసీదు నిర్మాణానికి మార్గం కల్పించడానికి మందిరాన్ని కూల్చివేసినట్లు చూపించడానికి ఆధారాలు ఉన్నాయి’’ అని వాదించారు. కోర్టులో వాదనల తర్వాత ఇరు పక్షాలు అంగీకరించడంతో నివేదిక బహిరంగపరచాలని కోర్టు ఆదేశించింది.

అంతకుముందు జనవరి 16న జ్ఞాన్‌వాపి మసీదులోని ‘వజుఖానా’లో శివలింగం ఉందని ఆరోపించబడుతున్న ప్రాంతాన్ని శుభ్రం చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా.. అందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. 2022లో కోర్టు ఆదేశాల మేరకు మసీదులో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించారు. ఇందులో వాజూఖానా ప్రాంతంలోని ఓ కొలనులో శివలింగం వంటి ఆకారం బయటపడింది. హిందువులు దీనిని శివలింగం అని చెబుతుండగా.. మసీదు కమిటీ మాత్రం దీన్ని ‘ఫౌంటెన్’ అని చెబుతోంది.