Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ తొలిరోజు భారత్ ఓడిపోయింది, విమానాలు కూలిపోయాయి: కాంగ్రెస్ మాజీ సీఎం.
- ఆపరేషన్ సిందూర్ తొలి రోజు భారత్ ఓడిపోయింది..
- విమానాలు కూడా కూలిపోయి ఉండవచ్చు..
- కాంగ్రెస్ మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ సంచలన వ్యాఖ్యలు..
Operation Sindoor: కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పూణేలో మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ మొదటి రోజే భారత్ పూర్తి ఓటమిని చవిచూసిందని అన్నారు. 7వ తేదీని దాదాపు అరగంట పాటు జరిగిన వైమానిక యుద్ధంలో భారత్ ఓడిపోయిందని, కొన్ని విమానాలు కూలిపోయి ఉండవచ్చని ఆయన అన్నారు. భారత వైమానిక దళం పూర్తిగా నిలిచిపోయిందని, ఒక్క విమానం కూడా ఎగరలేదని చెప్పారు. గ్వాలియర్, బటిండా, సిర్సా నుంచి ఏదైనా విమానం టేకాఫ్ అయితే, పాకిస్తాన్ కూల్చివేసే అవకాశం ఉందని, అందుకే వైమానిక దళం పూర్తిగా నేలకే పరిమితమైందని అన్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో ఆర్మీ ఒక్క కిలోమీటరు కూడా కదలలేదని, రెండు మూడు రోజులు జరిగిందంతా వైమానిక, క్షిపణి యుద్ధమే అని, భవిష్యత్తులో కూడా ఇలాంటి యుద్ధాలే ఉంటాయని అన్నారు. యుద్ధం స్వభావం మారినప్పుడు, దేశానికి 1.2 మిలియన్ల సైనికులు అవసరమా? అని ప్రశ్నించారు.
ఆపరేషన్ సిందూర్ తొలి రోజు ఏం జరిగింది:
ఆపరేషన్ సిందూర్ తొలి రోజు భారత్ వైమానిక దళం పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రస్థావరాలను నాశనం చేశాయి. పాక్ పంజాబ్ ప్రావిన్సులో ఉన్న బలవల్పూర్‌లోని జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది హతమయ్యారు. పీఓకేలోని మురిడ్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం ధ్వంసమైంది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు మరణించారు.
Pune: Former Maharashtra CM and senior Congress leader Prithviraj Chavan says, "On the first day (of Operation Sindoor) we were completely defeated. In the half-hour aerial engagement that took place on the 7th, we were fully defeated, whether people accept it or not. Indian… pic.twitter.com/3JRROmLoJh
— ANI (@ANI) December 16, 2025
తాజావార్తలు
-
Shocking: 9వ తరగతి బాలుడిపై స్నేహితుడి వదిన అత్యాచారం.. ఫోటోలతో బ్లాక్మెయిల్..
-
Harish Rao : రేవంత్ రెడ్డి తీరుపై హరీష్ రావు నిప్పులు.. మళ్లీ కాంగ్రెస్ గెలుపు ఒక కల..!
-
IPL 2026: “వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మహాత్రే కంటే ఆ కుర్రాడు చాలా గ్రేట్”.. మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..
-
Amazon: ఒక్క ఒప్పందంతో ఏఐ ప్రపంచాన్ని షేక్ చేసిన అమెజాన్! రూ.2,10,000 కోట్లతో అమెజాన్ సాహసోపేత నిర్ణయం..
-
Pappu Yadav: ‘‘రాజకీయాల్లోకి రావాలంటే బెడ్రూంలోకి వెళ్లాల్సిందే’’.. మహిళలపై ఎంపీ అసభ్యకర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!