Site icon NTV Telugu

Operation Sindoor: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పీఎం షెహబాజ్ షరీఫ్ అడ్డానే కొట్టి వచ్చాం..

Paki

Paki

Operation Sindoor: సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కి భారత్ దిమ్మతిరిగే రీతిలో జవాబు ఇచ్చింది. గత నెలలో పాకిస్తాన్‌కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు పహల్గామ్‌లో 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. మతం ఆధారంగా హిందువులను టార్గెట్ చేస్తూ కాల్చి చంపారు. ఈ దాడికి కారణమైన ఉగ్రవాదం, దానికి మద్దతు ఇస్తున్న పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు బలంగా కోరుకున్నారు.

ప్రజల మనోభీష్టం మేరకు కేంద్ర ప్రభుత్వం ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల్ని వణికించింది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పీఓకే‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారీ దాడులు చేసింది. హామర్, స్కాల్ప్ మిసైళ్లతో విరుచుకుడింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి శిక్షణ శిబిరాలను నాశనం చేసింది.

ఈ దాడి ఎంతో ప్రత్యేకం:

అయితే, గతంతో పోలిస్తే ఈసారి పాకిస్తాన్‌లో దూరి మరీ భారత్ లక్ష్యాలను కొట్టి వచ్చింది. గతంలో పీఓకేలో ఉగ్రవాదుల్ని అణిచివేసిన భారత్, ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సుల్లోని సియాల్‌కోట్, మురిడ్కేలతో పాటు సరిహద్దులకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్ వంటి ప్రాంతాలను టార్గెట్ చేసింది. బహవల్పూర్ జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్, దీని చీఫ్ మసూద్ అజార్ కూడా ఇక్కడే ఉంటాడు. ఈ ఉగ్రవాదిని టార్గెట్ చేస్తూ భారత్ తీవ్ర దాడులు జరిపింది. మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది ఈ దాడుల్లో హతమయ్యారు.

పాక్ ఆర్మీ చీఫ్, పీఎం షహబాజ్ షరీఫ్‌లకు వార్నింగ్..

ఈ దాడుల ద్వారా భారత్ పాకిస్తాన్‌కి క్లియర్ మెసేజ్ ఇచ్చింది. మీరు ఉగ్రవాదానికి పాల్పడితే పాకిస్తాన్‌లోకి దూరి మరీ విధ్వంసం సృష్టిస్తామని చెప్పింది. గతంలో బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని బాలాకోట్ ఉగ్ర శిబిరంపై దాడి చేయడం, ఇప్పుడు పంజాబ్ ప్రావిన్సులోని పలు ప్రాంతాల్లో దాడి చేయడానికి చాలా తేడా ఉంది.

నిజానికి పాకిస్తాన్‌లో పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులు ఉన్నప్పటికీ పాక్ పరిపాలన, సైన్యం అంతా పంజాబ్‌కి చెందిన వారే ఉంటారు. రాజకీయ నాయకత్వం, సైన్యాధికారులు పంజాబీలే. ఇప్పుడు భారత్ పంజాబ్‌పై దాడి చేయడం చూస్తే, నేరుగా వీరినే ఛాలెంజ్ చేసినట్లు అవుతుంది. పాకిస్తాన్ మొత్తం పంజాబ్ అస్థి్త్వంపైనే ఆధారపడి ఉంది. ఆ దేశంలో ఒక్క పంజాబ్ ప్రజలు మాత్రమే పాకిస్తాన్ గురించి ఆలోచిస్తుంటారు. మిగతా మూడు ప్రావిన్సులు వారిలో పాకిస్తాన్ దేశం అనే భావన ఉండదు. పంజాబీల విపరీతమైన డామినేషన్ కూడా ఇందుకు ఓ కారణం. ఇప్పుడు భారత్ తన సరిహద్దు నుంచి పాక్ పంజాబ్ లోని 100 కి.మీ దూరంలోని బహవల్పూర్‌లో దాడి చేయడం పాక్ పాలనలకు గట్టి హెచ్చరిక అని చెప్పవచ్చు.

Exit mobile version