NTV Telugu Site icon

Bangladesh Violence: బంగ్లాదేశ్ హింస, షేక్ హసీనా రాకపై జైశంకర్ కీలక ప్రకటన..

Bamgladesh

Bamgladesh

Bangladesh Violence: బంగ్లాదేశ్ హింసపై ఇండియా ఆందోళన చెందుతోంది. తీవ్ర హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో నిన్న బంగ్లా ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా, భారత్‌కి చేరింది. ఇక్కడ నుంచి బ్రిటన్‌లో ఆశ్రయం పొందేందుకు వెళ్తున్నట్లు సమచారం. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులను టార్గెట్ చేస్తున్నారు హింసాత్మకవాదులు. దీంతో భారత్ అక్కడి మైనారిటీల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Read Also: Pregnant Women Diet: ప్రెగ్నన్సీ సమయంలో ఇవి తాగడం ప్రమాదకరం.. పిల్లలపై ప్రతికూల ప్రభావం!

తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘‘మా దౌత్య కార్యకలాపాల ద్వారా మేము బంగ్లాదేశ్‌లోని భారతీయ సమాజంతో టచ్‌లో ఉన్నామని చెప్పారు. అక్కడ 19,000 మంది భారతీయులు ఉన్నారని అంచనా. 9000 మంది విద్యార్థులు జూలైలో తిరిగి వచ్చారు… మేము వారి రక్షణ మరియు శ్రేయస్సును నిర్ధారించడానికి వివిధ సమూహాలు మరియు సంస్థల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాము. శాంతిభద్రతలను పునరుద్ధరించే వరకు తీవ్ర ఆందోళన చెందుతున్నాము. ఈ సంక్షిష్ట పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని కోరాము. గత 24 గంటలుగా ఢాకాలోని అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఆ దేశంలో మైనారిటీల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నాము’’ అని అన్నారు.

బంగ్లాదేశ్ లో ఉన్న భారత్ దేశ వ్యవస్థలను అక్కడి ప్రభుత్వం కాపాడుతుందని అశిస్తున్నామని అన్నారు. బంగ్లాదేశ్ లోని మైనారిటీలు, వారి వ్యాపారాలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఆ దేశంలోని హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, బంగ్లాదేశ్ సైన్యంతో ఎప్పటికప్పుడు భారత్ మాట్లాడుతూనే ఉందని జైశంకర్ సభలో చెప్పారు. ఆ దేశంలో భారత్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, షేక్ హసీనా భారత్ వస్తానని అభ్యర్థించినట్లు వెల్లడించారు. అతి తక్కువ సమయంలో ఆమె భారత్ వస్తున్నట్లు సమచారం అందినట్లు తెలిపారు.

Show comments