Site icon NTV Telugu

Himanta Sarma vs Rahul Gandhi: అవినీతి ఆరోపణలపై నేతల మధ్య మాటల యుద్ధం

Rahulganhdi2

Rahulganhdi2

అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్మ, కాంగ్రెస్ అగ్ర రాహుల్‌గాంధీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బుధవారం అస్సాంలోని చాయ్‌వాగ్‌లో రాహుల్‌గాంధీ పర్యటించారు. చయ్‌గావ్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. హిమంత తనను తాను రాజుగా భావిస్తున్నారని.. కానీ అవినీతి కేసుల్లో ఆయన జైలుకి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. కాంగ్రెస్‌ కాకుండా.. ప్రజలే ఆయన్ను జైలుకు పంపిస్తారన్నారు.

ఇది కూడా చదవండి: Siddaramaiah: సిద్ధరామయ్య కన్నుమూత అంటూ అనువాదం.. మెటా క్షమాపణ

దీనికి కౌంటర్‌గా బిశ్వంత శర్మ స్పందిస్తూ.. రాహుల్ వ్యాఖ్యల కారణంగా తమ రాష్ట్రంలోని ఆక్రమణదారులు రెచ్చిపోయి పోలీసుల పైనే దాడి చేశారని ఆరోపించారు. అటవీ భూమిలో ప్రజలు స్థిరపడలేరని రాహుల్‌ గ్రహించలేకపోతున్నారన్నారు. కానీ, కబ్జాదారులకు అదే స్థలంలో పునరావాసం కల్పిస్తామని, ఇళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని ఆరోపించారు. ఈ రకమైన ప్రసంగాల కారణంగా రాష్ట్రంలోని ఆక్రమణదారులు రెచ్చిపోయారన్నారు. వారు రెచ్చిపోయి పోలీసులపైనే దాడి చేశారని ఆరోపించారు. ఈ విషయంపై కేసు నమోదు చేశామని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాలీలో రాహుల్‌ చేసిన ప్రసంగాలను పోలీసులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. ప్రసంగాలతో హింసను ప్రేరేపించినట్లు విచారణలో తేలితే రాహుల్‌, మల్లికార్జున ఖర్గేలపై పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇప్పటికే రాబర్ట్‌ వాద్రాకు చెందిన పలు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ‘గాంధీల’ కోసం చాలా జైళ్లు ఎదురుచూస్తున్నాయని హిమంత కౌంటర్‌ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Vizag: నేడు ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ నౌక జాతికి అంకితం

Exit mobile version