NTV Telugu Site icon

Maharashtra: మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ పొత్తుకు బీటలు.. మంట పెట్టిన ఆర్ఎస్ఎస్ కథనం..

Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయేలో భాగంగా ఉన్న బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పొత్తుకు బీటలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే కూటమి కన్నా ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఒక్కసారిగా బీజేపీ, ఎన్సీపీ మధ్య తీవ్ర విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 48 సీట్లలో ఎన్డీయే కూటమి 17 సీట్లు(బీజేపీ 09, శివసేన షిండే 07, ఎన్సీపీ అజిత్ పవార్ 01) గెలుచుకుంటే, ఇండియా కూటమి 30( కాంగ్రెస్ 13, శివసేన ఉద్ధవ్ 09, ఎన్సీపీ శరద్ పవార్ 08) స్థానాలను గెలుచుకుంది.

ఇదిలా ఉంటే, మరోవైపు ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న సమయంలో రాజకీయాలు వేగంగా మారతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయాలా వద్దా అనేదాన్ని అంచనా వేయడానికి బీజేపీ అంతర్గత సర్వే ప్రారంభించింది. ఇదిలా ఉంటే బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ ఈ పొత్తును అంగీకరించడం లేదు. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ పత్రిక ‘ఆర్గనైజర్’లో వచ్చిన కథనం ఇరు పార్టీల మధ్య దూరాన్ని మరింతగా పెంచుతోంది.

Read Also: Sikkim Landslides: సిక్కింలో విరిగిపడ్డ కొండచరియలు.. ఆరుగురు మృతి… ప్రమాదంలో 1500 మంది

‘‘ఈ అనాలోచిత చర్య ఎందుకు తీసుకున్నారు? ఈ కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఏళ్ల తరబడి పోరాడినందుకు బిజెపి మద్దతుదారులు గాయపడ్డారు మరియు హింసించబడ్డారు. ఒక్క దెబ్బతో బిజెపి తన బ్రాండ్ విలువను తగ్గించుకుంది’’ అని ఆర్ఎస్ఎస్ రతన్ శారదా కథనంలో రాశారు. అనమసరమైన రాజకీయాలకు, అవకతవకలకు మహారాష్ట్ర మంచి ఉదాహారణ అని, బాగా పనిచేసిన పార్లమెంటీరియన్ల కన్నా ఆలస్యంగా వచ్చిన వారిని ఆదరించారని ఆర్టికల్ పేర్కొంది.

ఇదిలా ఉంటే ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఈ కథనం రెండు పక్షాల మధ్య బాగా లేదనేదానికి సంకేతంగా భావించొద్దని అన్నారు. ఇదిలా ఉంటే ఎన్సీపీ యువజన విభాగం నాయకుడు సూరచ్ చవాన్ మాట్లాడుతూ.. బీజేపీ పనితీరు కనబరిచినప్పుడు ఆ క్రెడిట్ ఆర్ఎస్ఎస్‌కి ఇవ్వబడుతోందని, ఓడితే అజిత్ పవార్‌ని నిందిస్తు్న్నారని అన్నారు. దీనిపై బీజేపీ నతే ప్రవీణ్ దారేకర్ స్పందిస్తూ..”ఆర్‌ఎస్‌ఎస్ మనందరికీ తండ్రి లాంటిది. ఆర్‌ఎస్‌ఎస్ గురించి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. సూరజ్ చవాన్ సంస్థపై వ్యాఖ్యానించడానికి తొందరపడి ఉండకూడదు.’’ అని అన్నారు.

ఇదిలా ఉంటే ఎన్సీపీ సీనియర్ నేత, మంత్రి ఛగన్ భుజ్‌బల్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకు గానూ మాకు (ఎన్‌సీపీ) కేవలం 4 సీట్లు మాత్రమే ఇచ్చారని, ఇందులో రాయ్‌గఢ్ మాత్రమే గెలుచుకున్నామని, బీజేపీ కూడా పలు రాష్ట్రాల్లో సీట్లను కోల్పోయిందని, ఉత్తర్ ప్రదేశ్‌లో ఆ పార్టీకి సీట్లు తగ్గుతాయని ఎవరూ అనుకోలేదని అన్నారు.