వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. మొత్తానికి ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడంతో ఇక రాష్ట్రపతి వంతు వచ్చింది. ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరకు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే.. చట్టం అమల్లోకి రానుంది. ఇక రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై అర్ధరాత్రి వరకు వాడీవేడీగా చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు లోపాలు ఎత్తిచూపాయి. మొత్తానికి ఉభయ సభల్లో సులువుగానే బిల్లు ఆమోదం పొందడం విశేషం.
ఇది కూడా చదవండి: Mumbai: బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ కన్నుమూత
ఇక ఈ బిల్లు ముస్లింల ప్రయోజనాలకు హాని కలిగిస్తుందనే ఆరోపణలను మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. ఈ బిల్లుతో ముస్లింలకే లాభమని.. బిల్లు ఆమోదంతో ముస్లిమేతరులు ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరని పేర్కొన్నారు. అయినా ఈ బిల్లు మతానికి సంబంధించింది కాదని.. ఆస్తి, దాని నిర్వహణకు, అవినీతిని నిర్మూలించడమే ఈ బిల్లు లక్ష్యమని తెలిపారు.
వక్ఫ్ బిల్లుపై బుధవారం లోక్‌సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. అనంతరం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు.
ఇది కూడా చదవండి: Siddu Jonnalagadda: జాక్.. చేస్తాడు మనసుల్ని హ్యాక్ : సిద్ధూ జొన్నలగడ్డ