NTV Telugu Site icon

Amit Shah: అలా చేయండి.. మమతా బెనర్జీ గుండాలను తలకిందులుగా వేలాడదీస్తాం..

Amit Shah

Amit Shah

Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అమిత్ షా, మమతా బెనర్జీ వైఫల్యాలను ఎండగట్టారు. సీఏఏ చట్టం ప్రకారం హిందూ శరణార్థులందరికీ పౌరసత్వం లభిస్తుందని ఆయన చెప్పారు. రాయ్‌గంజ్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న కార్తీక్ పాల్‌కి మద్దతు ఇచ్చేందుకు ఆయన బెంగాల్ వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 019లో రాయ్‌గంజ్ సీటును బీజేపీ గెలుచుకుంది. ఉత్తర బెంగాల్ స్థానం నుంచి తృణమూల్ ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణిని పోటీకి దింపింది.

రాష్ట్రంలోకి చొరబాట్లను మమతా బెనర్జీ ఆపనలేదని, చొరబాట్లను ఆపే సత్తా మోడీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు. గతసారి మీరు 18 సీట్లు ఇస్తే మోడీ రామమందిరాన్ని ఇచ్చారు, ఈసారి మాకు 35 సీట్లు ఇవ్వండి, చొరబాట్లను ఆపుతాం అని అమిత్ షా అన్నారు. ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారిన సందేశ్‌ఖాలీ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. సందేశ్‌ఖాలీలో తమ ఓటు బ్యాంకుపై ఎలాంటి ప్రభావం పడకుండా మమతా బెనర్జీ మహిళల్ని హించారని, హైకోర్టు జోక్యంతో ఈ రోజు నిందితులు జైళ్లలో ఉన్నారని అమిత్ షా చెప్పారు. తృణమూల్ నేతలు సందేశ్‌ఖాలీ మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలతో ఆ ప్రాంతం అట్టుడికింది. మహిళలు నిందితుల్ని శిక్షించాలని పెద్ద ఉద్యమం చేశారు.

Read Also: Zero Shadow Day: రేపు బెంగళూర్‌లో “నీడ” మాయం.. అసలు “జీరో షాడో డే” అంటే ఏమిటి..?

బంగ్లాదేశ్ చొరబాట్లను మమతా సమర్థిస్తున్నారని, బీజేపీకి ఓటేస్తే టీఎంసీ గుండాలను తలకిందులుగా వేలాడదీస్తామని, సరిదిద్దుతామని అన్నారు. టీఎంసీ అవినీతికి పాల్పడుతోందని, గతంలో గడ్డితో కప్పబడిన ఇళ్లలో ఉండే వారు ప్రస్తుతం నాలుగు అంతస్తుల ఇళ్లు కలిగి ఉన్నారని, కార్లతో తిరుగుతున్నారని, ఇదంతా ప్రజల డబ్బే అని అమిత్ షా అన్నారు. మళ్లీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో కేంద్రం ఎయిమ్స్ ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు.

మరోవైపు బీజేపీ మొదటిదశలో ఓటమిని గ్రహించిందని, అందుకే భయపడుతోందని, అందుకే నిరాధారమైన ప్రకటను ఇస్తున్నారని, కాషాయ శిబిరం ఘోరంగా పరాజయం పాలైందని మమతా బెనర్జీ సోమవారం ఆరోపించారు. సందేశ్‌ఖాలీ తమపై నింద జల్లేందుకు బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. సీసీఏని పశ్చిమ బెంగాల్లో అనుమతించమని దీదీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఏఏ, ఎన్ఆర్సీని అనుమతించమని, మీరు దరఖాస్తు చేసుకుంటే విదేశీయులుగా మారిపోతారని ఆమె అన్నారు.