కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. సమీపంలో ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయాల్లో ప్రాణాలకే ప్రమాదం. అయితే ఒక్కోసారి అదృష్టం బాగుండి క్షేమంగా ప్రాణాలతో బయటపడుతుంటారు. కొన్నిసార్లు ప్రమాదాన్ని సడన్ గా గుర్తించడం ద్వారా వారు అప్రమత్తమవుతారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. షూలో కాలు పెడుతుంటే.. పాము బుసలు కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈఘటన కర్నాటకలో మైసూరులో చోటు చేసుకుంది.
Read also:Rakul Preet Singh: నా పెళ్లి గురించి నాకైనా క్లారిటీ ఇవ్వాలి కదా బ్రో..
ఓ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి బూట్లు వేసుకోవడానికి సిద్ధమయ్యాడు. సాధారణంగా ఎవరైనా ముందు లేదా తర్వాత గమనించకుండా షూలో కాలు వేస్తారు. అతను అదే చేయబోతున్నాడు. కానీ అకస్మాత్తుగా ఒక షూ నుండి ఒక పాము బయటకు వచ్చి పడగవిప్పి బుసలు కొట్టింది. అంతే అక్కడున్న ఆవ్యక్తి వామ్మో! అంటూ బయటకు పరుగులు పెట్టాడు. స్నేక్ క్యాచర్ కు ఫోల్ చేసాడు. దీంతో అక్కడకు చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు.. షూలలో విష సర్పాలు దాక్కోవడం గతంలో కూడా చాలా సార్లు జరిగాయి. పెద్దలు చెప్పినట్లు “ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో” అన్నట్లుగా, ఎక్కడ ఏ విష సర్పం దాక్కుని ఉంటుందో తెలీని పరిస్థితి. అందుకే ఏ పని చేసినా ముందు.. కాస్త జాగ్రత్తలు పాటించాల్సి ఉందని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.
షూలో పాము.. వీడియో ఇదే..