సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో దర్శనం ఇచ్చింది. ఓ వ్యక్తిపై దుండగులు తుపాకితో బుల్లెట్ల వర్షం కురిపిస్తుండగా ధైర్యంతో ఎదురుదాడి చేసిందో మహిళా. అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా అవుతోంది. ఈ సంఘటన హర్యానాలోని భివానీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. హర్యానాలో వానీలోని డాబర్ కాలనీలో ఓ వ్యక్తి ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. అదే సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఐదుగురు దుండగులు అక్కడి వచ్చారు.
Also Read: World Cup: ఫైనల్‌లో భారత్ ఓటమిపై సంబరాలు.. కాశ్మీరీ స్టూడెంట్స్‌పై “ఉపా” కేసు..
వెనక కూర్చున్న ఇద్దరు వ్యక్తులు వాహనం దిగుతూనే ఇంటి ముందు నిలబడి ఉన్న వ్యక్తిపై తుపాకితో కాల్పులు జరిపారు. దీంతో అతడు భయపడి ఇంట్లోకి వెళ్లి తప్పించుకున్నాడు. అదే సమయంలో ఓ మహిళా ఎదురు ఇంటి నుంచి వచ్చింది. ఆ వ్యక్తి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న తుపాకులను సైతం ఏమాత్రం లెక్క చేయలేదు. ఓ పెద్ద కర్రతో దుండగులపై ఎదురు దాడికి ప్రయత్నించింది. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో ఆ మహిళపై కూడా కాల్పులు జరిపారు. కానీ ఆమె తప్పించుకుంది.
Also Read: Free Tourist Visas: భారత్‌తో పాటు 6 దేశాలకు శ్రీలంక ‘ఉచిత టూరిస్ట్ వీసాలు’
ముష్కరులు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరపగా, ఆ వ్యక్తి నాలుగు బుల్లెట్లతో గాయపడ్డారు. దీంతో అతడిని ఆస్పత్రి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆ మహిళా ధైర్యానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. తుపాకులను సైతం లెక్క చేయని ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్నారు. అయితే ఘటనలో గాయపడిన వ్యక్తి ఇటీవల దారుణ హత్యకు గురైన రవి బాక్సార్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న హరికిషన్. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా జైలుకు వెళ్లిన హరికిషన్ ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చాడు. అతడు గ్యాంగ్‌స్టర్ భవ్య బిష్ణోయ్‌తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. అతడిపై దాడికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్న ఐదుగురిని మూడు నెలల క్రితం భివానీ పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.
Bravery. Haven't EVER seen anything close to this!
4 armed men, on a shooting spree, being chased by a middle aged woman, with a BROOM. pic.twitter.com/fbbboLW9jU
— CA Mayank Parakh (@Mayank_Parakh) November 28, 2023