NTV Telugu Site icon

Dogs Wedding: సన్నాయి మేళాలు, డీజే చప్పుళ్ల మధ్య కుక్కలకు పెళ్లి.. సోషల్ మీడియాలో వైరల్

Dogs Wedding

Dogs Wedding

Dogs Wedding: పెళ్లి అంటే జీవితంలో ఒకేసారి వచ్చే మరపురాని సంబరం. అందుకే పెళ్లి అంటే బంధుమిత్రులతో పాటు పెద్దలను ఆహ్వానించి సంప్రదాయం ప్రకారం సన్నాయి మేళాలు, డీజే చప్పుళ్ల మధ్య జరుపుతుంటారు. అయితే ఈరోజుల్లో మనుషులకే పెళ్లిళ్లు అవుతుండటం కష్టంగా మారితే.. కొందరు మాత్రం కుక్కలకు కూడా వివాహం చేసేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్‌లో రెండు కుక్కలకు ఘనంగా వివాహం జరిగింది. అది అలా ఇలా కాదు.. అందరూ చూసి ఆశ్చర్యపడేలా అని చెప్పాలి. జైలీ అనే ఆడకుక్కకు, టామీ అనే మగకుక్కకు వాటి యజమానులు ఎంతో వైభవంగా బాజా భజంత్రీలు, వేద మంత్రాల నడుమ పెళ్లి జరిపించారు.

Read Also: PM-KISAN : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇక నుంచి ఎకరాకు రూ.8వేలు

మామూలుగా మనుషులకు ఎలాగైతే పెళ్లి చేస్తారో అలాగే తమకు ఎంతో ఇష్టమైన కుక్కలకు యజమానులు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. తమకు కావాల్సిన వాళ్లందరికీ పెళ్లి ఆహ్వానం పంపించారు. భారీగా పెళ్లి సెటప్ సిద్ధం చేశారు. పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం జైలీ, టామీలకు వివాహం చేశారు. డీజే కూడా పెట్టించడంతో వచ్చిన అతిథులు అంతా ఉత్సాహంగా పెళ్లి తంతులో పాల్గొన్నారు. డీజే పాటలకు వచ్చిన అతిథులు స్టెప్పులు కూడా వేశారు. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్న ఈ కుక్కల పెళ్లి వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.

Show comments