NTV Telugu Site icon

Mahavir phogat: వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి వెళ్లడం తప్పు.. పెద్దనాన్న మహవీర్ వ్యాఖ్య

Vineshphogat

Vineshphogat

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరింది. హస్తం పార్టీలో చేరిన కొద్ది సేపటికే ఆమెకు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కేటాయించింది. జులానా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే వినేష్ ఫోగట్ పొలిటికల్ ఎంట్రీపై ఆమె పెద్దనాన్న మహవీర్ ఫోగట్ తప్పుపట్టారు. ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు్న్నట్లు తెలిపారు. మరో ఒలింపిక్స్‌లో పాల్గొని బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు. దానికోసం రెజ్లింగ్‌పై దృష్టి పెట్టాలని హితవు పలికారు. యువకులైన పిల్లలు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారని.. వారికి నచ్చజెప్పడమే తన బాధ్యత అని ఆయన చెప్పుకొచ్చారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ రెండు జాబితాలను విడుదల చేసింది. తొలి జాబితాలోనే వినేష్ ఫోగట్‌కు టికెట్ లభించింది. ఇక కాంగ్రెస్‌-ఆప్ పొత్తు ఉంటుందని అంతా భావించారు. కానీ పొత్తు లేకుండానే ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి. సోమవారం ఆప్ 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అలాగే సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. ఇక బీజేపీ కూడా తొలి జాబితాను విడుదల చేసింది. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Haryana: ఆటో డ్రైవర్‌పై ప్రశంసలు.. ఎంత మంచి పని చేశాడంటే..!