NTV Telugu Site icon

Yogeshwar dutt: వినేష్ ఫోగట్.. దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే

Yogeshwardutt

Yogeshwardutt

కాంగ్రెస్ నేత, స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై లండన్ ఒలింపిక్ విజేత యోగేశ్వర్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత గురికావటంపై బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. ఇతరులపై నిందలు వేయడం సమంజసం కాదని వినేష్ ఫోగట్‌కు సూచించారు. అనర్హతకు గురైనందుకు దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: UP: హిందువునని చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసిన ముస్లిం.. తప్పించుకున్న యువతి

యోగేశ్వర్ దత్ మీడియాతో మాట్లాడారు. ఒకవేళ తనపై ఇటువంటి అనర్హత వేటు పడి ఉంటే తక్షణమే దేశానికి క్షమాపణలు చెప్పేవాడినన్నారు. ఈ అంశాన్ని వినేష్ ఫోగట్ ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం పట్ల అసంతృప్తికి గురైనట్లు తెలిపారు. కుట్ర జరిగిందన్న వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యం కలిగించాయని చెప్పారు. పైగా ప్రధానమంత్రిని నిందించే స్థాయికి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. గ్రాము కంటే ఎక్కువ ఉంటే అనర్హత వేటు వేస్తారని అందరికీ తెలిసిన విషయమేనని వివరించారు. ఫైనల్‌కు వెళ్లిన సమయంలో ఆమెకు దేశమంతా మద్దతుగా నిలిచిందని గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Delhi HC: భర్త వేరే మహిళలతో సహజీవనం చేసినా ‘‘గృహ హింస’’గానే పరిగణించబడుతుంది..

పారిస్ ఒలింపిక్స్‌లో వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. దీంతో ఆమె నిరాశతో భారత్‌కు వచ్చేశారు. అనంతరం హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆమె రాజకీయాల వైపు మొగ్గు చూపారు. అంతే కాంగ్రెస్‌లో చేరి.. జులానా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Bhadradri Kothagudem: పిడుగుపాటుకు ఇద్దరు బలి.. మరో ముగ్గురికి గాయాలు