NTV Telugu Site icon

Delhi: కాంగ్రెస్‌లో చేరిన భారత రెజర్లు వినేష్ ఫోగట్, పునియా.. హర్యానా నుంచి బరిలోకి..!

Congress

Congress

భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ. వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి రెజ్లర్లు ఇద్దరూ బరిలోకి దిగనున్నారు.

ఇది కూడా చదవండి: Vinesh Phogat: రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ కీలక ప్రకటన!

అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, పునియా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇందుకోసమే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదని సమాచారం. ఈ సాయంత్రం తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. జాబితాలో ఇద్దరి పేర్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఆప్‌తో పొత్తు అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఆమ్ ఆద్మీకి కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం చేస్తోంది. కానీ ఆప్ మాత్రం 10 స్థానాలు కోరుకుంటోంది. సీట్ల పంచాయితీ తెగకపోవడంతో రెండు పార్టీల మధ్య అయోమయం, గందరగోళం నెలకొంది.

ఇది కూడా చదవండి: Shivraj Singh Chauhan: రైతులకి సహాయం చేయడం అంటే దేవుడికి పూజ చేసినట్లే..

అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసింది. 67 మంది సభ్యులతో కూడిన జాబితాను కమలం పార్టీ ప్రకటించింది. ఇక కాంగ్రెస్ జాబితా ప్రకటించడమే ఆలస్యం అయింది. జాబితా రాగానే బలబలాలు ఏంటో తేలిపోనుంది.