Vinay Kumar: రష్యాకు భారత రాయబారిగా వినయ్ కుమార్ నియామకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinay Kumar: రష్యాలో భారత రాయబారిగా వినయ్ కుమార్‌ని నియమించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) తెలియజేసింది. ప్రస్తుతం మయన్మార్‌లో భారత రాయబారిగా ఉన్న 1992 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ కుమార్, త్వరలోనే తన బాధ్యతలు చేపడుతారని ఎంఈఏ తెలియజేసింది. ఇటీవల రష్యాలో ఎన్నికలు జరిగాయి, మరోసారి పుతిన్ భారీ మెజారిటీతో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గెలుపు తర్వాత ఈ నియామకం చోటు చేసుకుంది.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారత్-రష్యా బంధం తీవ్ర పరీక్షలను ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత భారత్‌పై అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. రష్యా నుంచి భారత సంబంధాల విషయంలో మన దేశాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినయ్ కుమార్ రష్యాకి రాయబారిగా నియమించబడ్డారు.
Also Read
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
Read Also: Sita Soren: జేఎంఎంకు సీతా సోరెన్ షాక్.. బీజేపీలో చేరిక
2024 ఎన్నికల్లో పుతిన్ భారీ విజయం సాధించిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనందుకు మిస్టర్ వ్లాదిమిర్ పుతిన్‌కు హృదయపూర్వక అభినందనలు. రాబోయే సంవత్సరాల్లో భారత్-రష్యాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాము’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
రాజకీయ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, రక్షణ, సైన్ అండ్ టెక్నాలజీ సహా ఇరు దేశాల మధ్య అనేక దశాబ్ధాల స్నేహం ఉంది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో వెస్ట్రన్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా భారత్ వెనకడుగు వేయలేదు. రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటూనే ఉంది.
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!