NTV Telugu Site icon

Vinay Kumar: రష్యాకు భారత రాయబారిగా వినయ్ కుమార్ నియామకం..

Vinay Kumar

Vinay Kumar

Vinay Kumar: రష్యాలో భారత రాయబారిగా వినయ్ కుమార్‌ని నియమించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) తెలియజేసింది. ప్రస్తుతం మయన్మార్‌లో భారత రాయబారిగా ఉన్న 1992 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ కుమార్, త్వరలోనే తన బాధ్యతలు చేపడుతారని ఎంఈఏ తెలియజేసింది. ఇటీవల రష్యాలో ఎన్నికలు జరిగాయి, మరోసారి పుతిన్ భారీ మెజారిటీతో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గెలుపు తర్వాత ఈ నియామకం చోటు చేసుకుంది.

ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారత్-రష్యా బంధం తీవ్ర పరీక్షలను ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత భారత్‌పై అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. రష్యా నుంచి భారత సంబంధాల విషయంలో మన దేశాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినయ్ కుమార్ రష్యాకి రాయబారిగా నియమించబడ్డారు.

Read Also: Sita Soren: జేఎంఎంకు సీతా సోరెన్ షాక్.. బీజేపీలో చేరిక

2024 ఎన్నికల్లో పుతిన్ భారీ విజయం సాధించిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనందుకు మిస్టర్ వ్లాదిమిర్ పుతిన్‌కు హృదయపూర్వక అభినందనలు. రాబోయే సంవత్సరాల్లో భారత్-రష్యాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాము’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

రాజకీయ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, రక్షణ, సైన్ అండ్ టెక్నాలజీ సహా ఇరు దేశాల మధ్య అనేక దశాబ్ధాల స్నేహం ఉంది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో వెస్ట్రన్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా భారత్ వెనకడుగు వేయలేదు. రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటూనే ఉంది.