Site icon NTV Telugu

Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్ మరో ఘనత.. రెండోసారి చందమామపై ల్యాండింగ్.. ఇస్రో కొత్త వీడియో..

Chandrayaan 3

Chandrayaan 3

Chandrayaan-3 Mission: చంద్రయాన్-3 విజయవంతమైన చాలా రోజుల తర్వాత విక్రమ్ ల్యాండర్ మరో ఘనత సాధించింది. చంద్రుడి ఉపరితలంపై నుంచి పైకి ఎగిరి రెండోసారి సాఫ్ట్ ల్యాండింగ్ అయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది.

ఇటీవల ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిన దక్షిణ ధృవంపై సురక్షితంగా ల్యాండ్ అయింది. విక్రమ్ ల్యాండర్ ల్యాండైన ప్రదేశానికి ‘శివశక్తి’ పాయింట్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఆ సమయంలో ల్యాండ్ అయిన ప్రదేశం నుంచి 40 సెంటీమీటర్ల మేర పైకి లేకి, 30-40 సెంటీమీటర్ల దూరంలో మరోసారి సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఇస్రో వెల్లడించింది. బెంగళూర్ లోని కమాండ్ కంట్రోల్ నుంచి ఆదేశాలు అందుకున్న విక్రమ్ తన ఇంజన్లను మండించి సురక్షితంగా పైకి ఎగిరి సేఫ్ ప్లేస్ లో ల్యాండ్ అయింది.

Read Also: Harish Salve: 68 ఏళ్ల వయసులో మాజీ సొలిసిటర్ జనరల్ మూడోసారి పెళ్లి..

భవిష్యత్తులో చంద్రుడిపై నుంచి నమూనాలను తీసుకురావడం, మానవులను సురక్షితంగా భూమిపైకి తీసుకురావడం వంటి మిషన్లలో ఇలాంటి ప్రయోగం కీలకంగా ఉంటుందని ఇస్రో తెలిపింది. తాజాగా నిర్వహించిన ప్రయోగం తర్వాత విక్రమ్ ల్యాండర్ లోని అన్ని పేలోడ్లు సురక్షితంగా, హెల్తీగా ఉన్నాయని ఇస్రో వెల్లడించింది.

ఇటీవల చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ అయింది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతకుముందు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి. చంద్రయాన్-3తో వెళ్లిన రష్యా ‘లూనా-25’ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది. చంద్రయాన్-3 మిషన్ వల్ల దక్షిణ ధృవంపై ఆక్సిజన్, సల్ఫర్ ఉన్నట్లు తేలింది.

Exit mobile version