Vijay TVK Alliance: విజయ్ కూటమిలోకి ఎవరు..? మిత్రపక్షాల భేటీపై తమిళనాడులో పెరిగిన ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay TVK Alliance: తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) కూటమి విస్తరణ అంశం ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 9న TVK మిత్రపక్షాలతో కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో కొత్త రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించడంతో పాటు కూటమికి కొత్త పేరు ఖరారు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి MDMK, CPM, CPI, VCK, కాంగ్రెస్ పార్టీల నేతలను TVK ఆహ్వానించింది. గతంలో జరిగిన తొలి భేటీకి దూరంగా ఉన్న CPI, CPMలకు కూడా ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి భవిష్యత్ కార్యాచరణ, విస్తరణపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
వైకోకు గ్రీన్‌సిగ్నల్
MDMK నేత వైకో సెప్టెంబర్ 9న జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తాను ఈ భేటీకి వస్తానని ఆయన వెల్లడించారు. దీంతో మిత్రపక్షాల మధ్య సమన్వయం, ఎన్నికల వ్యూహంపై చర్చలు మరింత కీలకంగా మారనున్నాయి. అయితే CPI మాత్రం TVK కూటమిపై కీలక వైఖరిని స్పష్టం చేసింది. కూటమిలో చేరబోమని, భవిష్యత్తులో మంత్రివర్గంలోనూ భాగస్వామ్యం కాబోమని తెలిపింది. అవసరమైతే బయట నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని CPI స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబర్ 9 భేటీలో CPI వైఖరి కూడా చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
- Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
విజయ్ అడుగులపై కాంగ్రెస్ దృష్టి
విజయ్ను ప్రధానిగా చూడాలంటూ TVK ప్రచారం సాగిస్తున్న నేపథ్యంలో ఆయన రాజకీయ అడుగులపై కాంగ్రెస్ కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న జరిగే సమావేశంలో కూటమి విస్తరణ, మిత్రపక్షాల భాగస్వామ్యం, కొత్త రాజకీయ ఫ్రంట్ రూపకల్పన వంటి అంశాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తంగా తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికే విజయ్ TVK చుట్టూ ఆసక్తి పెరుగుతున్న వేళ.. సెప్టెంబర్ 9 భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కూటమికి కొత్త పేరు ఖరారవుతుందా? ఎవరెవరు విజయ్‌తో కలిసి నడుస్తారు? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
-
Vijay TVK Alliance: విజయ్ కూటమిలోకి ఎవరు..? మిత్రపక్షాల భేటీపై తమిళనాడులో పెరిగిన ఆసక్తి
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
IND vs AFG T20: వైభవ్‌తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
-
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్‌కు UN ఆమోదం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!