CM Vijay: అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల సరసన విజయ్.. “1967, 1977, 1982, 2026” అంటూ కీలక వ్యాఖ్యలు
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
- ‘‘అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్, విజయ్’’ అంటూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో టీవీకే అధినేత, సీఎం విజయ్ ప్రతిపక్ష డీఎంకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ప్రభుత్వ సమయంలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఇదే సమయంలో తన రాజకీయ ఎదుగుదల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నాదురై, ఎంజీఆర్, ఎన్టీఆర్ సరసన తన పేరును ప్రస్తావించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తమిళనాడుతో పాటు తెలుగు రాజకీయాల్లో కూడా ఆసక్తికరంగా మారాయి. “1967, 1977, 1982, 2026.. అన్నా, MGR, NTR, విజయ్” అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
1967లో సీఎన్ అన్నాదురై నేతృత్వంలో డీఎంకే పార్టీ ఏర్పడింది. ఆ తర్వాత తమిళ రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరదించింది. 1977లో ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీతో అధికారంలోకి వచ్చారు. డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదిగారు. 1977 ఎన్నికల్లో అన్నాడీఎంకే 234 స్థానాల్లో 132 గెలుచుకుంది. 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి చరిత్ర సృష్టించారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 294 సీట్లకు గానూ 201 స్థానాలు సాధించింది. పార్టీ స్థాపించిన కొన్ని నెలల్లోనే కాంగ్రెస్‌ను ఘోరంగా దెబ్బతీశారు.
Also Read
ఇప్పుడు ఇదే కోవలో తన విజయం చేరుతుందని విజయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 2026 తన రాజకీయ విజయానికి ప్రతీకగా విజయ్ ప్రస్తావించారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఆధిపత్యాన్ని అన్నాదురై సవాల్ చేసినట్లుగా, ఎంజీఆర్ డీఎంకేను సవాల్ చేసినట్లుగా, కాంగ్రెస్‌ను ఎన్టీఆర్ వ్యతిరేకించినట్లుగా, తాను కూడా తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదిగినట్లు విజయ్ సంకేతం ఇచ్చారు. ఇదే సమయంలో డీఎంకే నుంచి తనపై వస్తున్న విమర్శలపై అదే స్థాయిలో ప్రతిస్పందించబోమని విజయ్ చెప్పారు. గత 5 దశాబ్ధాల రాజకీయ చరిత్ర లోతుగా పరిశీలించి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన విషయాలు బయటకు తీసుకువస్తామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
CM Vijay: అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల సరసన విజయ్.. “1967, 1977, 1982, 2026” అంటూ కీలక వ్యాఖ్యలు
-
Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
-
LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
-
ChatGPT వాడుతున్నారా? ఇకపై మీకు ఒక కొత్త తలనొప్పి రాబోతుంది!
-
The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!