VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
- ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌కు హైకోర్టు బిగ్ షాక్..
- మనీలాండరింగ్ కేసులో విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VIJAY: తమిళనాడులో సీఎం ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాటు చేసుకుంటున్న టీవీకే పార్టీ అధినేత, స్టార్ యాక్టర్ విజయ్‌కు బిగ్ షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. విజయ్ ఆదాయాన్ని దాచిపెట్టారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, మనీలాండరింగ్ దర్యాప్తు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ ఎస్కే ధర్మాధికారారి, జస్టిన్ జి. అరుల్ మురుగన్ల ధర్మాసనం విచారించింది.
Read Also: Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
Also Read
- Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
- Padma Awards: 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేత.. మమ్ముట్టి, మాధవన్‌కు గౌరవం
- Pakistan: ఇస్లామిక్ ఐడెంటిటీ పక్కన పెట్టి.. భారత సంస్కృతి జపం చేస్తున్న పాక్.. ఎందుకో తెలుసా?
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
ఈ పిటిషన్ స్వీకరించదగినదా..? లేదా అనే సందేహాలపై రిజస్ట్రీ ఈ కేసుకు నెంబర్ కేటాయించలేదని గమనించిన ప్రధాన న్యాయమూర్తి.. ఈ అంశాన్ని నిర్ణయించడం న్యాయపరమైన విధి అని, రిజిస్ట్రీకు సంబంధం లేదని పేర్కొంది. ఈ పిటిషన్‌ను చెన్నైకి చెందిన ఎం రాజ్ కుమార్ దాళఖలు చేశారు. ఈ కేసులో ఐటీ అధికారులు, ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, విజయ్‌కు సంబంధించిన సెర్చ్ ప్రొసీడింగ్స్, అఫిడవిట్లు, పెనాల్టీ ఆర్డర్లను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌దారు కోర్టును కోరారు.
ఈ కేసును మనీలాండరింగ్ చట్టం(PMLA) కింద కూడా దర్యాప్తు జరపాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. సోదాలు, చట్టపరమైన విచారణ సందర్బంవగా వెల్లడైన ఆదాయాన్ని చెప్పకపోవడం, లెక్కలో చూపని నగదు పారితోషకంగా తీసుకోవడం, ఆర్ధిక లావాదేవీలను దాచిపెట్టడం వంటి వాటికి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 420, 467, 470, 471, 120B కింద మోసం, నకిలీ పత్రాలు, కుట్ర వంటి ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్లో కోరారు. ఇది విజయ్ ఆస్తులకు సంబంధించి దాఖలైన మూడో కేసు కావడం గమనార్హం. ఇంతకుముందు దాఖలైన పిటిషన్లో ఒక కేసులో ఆదాయపన్ను శాఖ స్పందించాలని కోర్టు విజయ్‌కి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసు విజయ్ నటించిన ‘‘పులి’’ సినిమాకు సంబంధించింది. 2015 పులి సినిమా సమయంలో ఐటీ శాఖ విజయ్ నివాసాలు, కార్యలయాల్లో సోదాలు నిర్వహించింది. నిర్మాతల నుంచి రూ. 4.93 కోట్ల నగదు, రూ. 16 కోట్ల చెక్కులు ద్వారా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగదు లావాదేవీలకు పన్ను చెల్లింపులు జరగలేదని గుర్తించారు. నిర్మాతలు చెక్కుల రూపంలో ఇచ్చిన వాటికి మాత్రమే టీడీఎస్ జమ చేశారు తప్పా, నగదు రూపంలో వాటికి చెల్లించలేదు. దీని తర్వాత విజయ్ అదనంగా రూ. 15 కోట్లను ఆదాయంగా ప్రకటించి పన్నులు చెల్లించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Toxic : కేజీఎఫ్ ఫార్ములానే.. అటు ఇటు చేసిన యష్!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
Padma Awards: 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేత.. మమ్ముట్టి, మాధవన్‌కు గౌరవం
-
Infosys Recruitment: ఇన్ఫోసిస్‌లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!