Infosys Recruitment: ఇన్ఫోసిస్‌లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత డిమాండ్ పరిస్థితుల మధ్య కూడా ప్రతిభావంతులను ఆకర్షించడంలో పెట్టుబడులను కొనసాగించింది. ఇందులో భాగంగానే ఆర్థిక సంవత్సరం 2026లో కంపెనీ 20,000 మందికి పైగా కాలేజీ గ్రాడ్యుయేట్లను కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంది. దీంతో ఇన్ఫోసిస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,25,000 మార్కును దాటింది.
కంపెనీ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో మేనేజ్మెంట్ మాట్లాడూతూ.. ఆర్థిక సంవత్సరం 2026 క్రమశిక్షణతో కూడిన అమలుతో సాగిందని, స్థిరమైన కరెన్సీ ఆదాయంలో 3.1 శాతం వృద్ధిని సాధించామని వెల్లడించింది. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, టెక్నాలజీ సేవల కోసం క్లయింట్ల నుంచి ఉన్న బలమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ.. ఈ ఏడాది ఇన్ఫోసిస్ 14.9 బిలియన్ డాలర్ల విలువైన 96 భారీ ఒప్పందాలను సొంతం చేసుకుంది.
Also Read
- Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
- Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
- Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
- Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
ప్రస్తుతం టెక్నాలజీ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఒక పెద్ద మార్పును ఎదుర్కొంటోందని, గత ఆవిష్కరణల కంటే ఏఐ అత్యంత విప్లవాత్మకమైనదని మేనేజ్మెంట్ పేర్కొంది. ఐటీ కంపెనీల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందనే ఆందోళనలను తోసిపుచ్చుతూ.. ఇన్ఫోసిస్ వంటి సంస్థలకు ఏఐ వల్ల ముప్పేమీ లేదని స్పష్టం చేసింది. చాలా కంపెనీలు రెడీమేడ్ ఉత్పత్తుల కంటే తమకు నచ్చినట్లుగా కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్లను రూపొందించుకోవడానికే ఇష్టపడతాయని, ఇది టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్లకు మరిన్ని పెద్ద అవకాశాలను సృష్టిస్తుందని తెలిపింది.
ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఏఐ సంబంధిత వ్యాపారం ద్వారా ఏటా దాదాపు 1 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. క్లయింట్లు తమ వ్యాపారాలను కేవలం ప్రయోగాల దశ నుంచి భారీ ఎత్తున విస్తరించేందుకు మొగ్గు చూపుతుండటంతో, రాబోయే రోజుల్లో ఏఐ సేవల ద్వారా వచ్చే ఆదాయం మరింత వేగంగా వృద్ధి చెందుతుందని ఇన్ఫోసిస్ యాజమాన్యం ధీమా వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
-
Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
-
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!