Site icon NTV Telugu

Extramarital Affair: ముగ్గురు పిల్లల తల్లి యువకుడితో ప్రేమాయణం.. భర్తకు తెలియడంతో కరెంట్ స్తంభమెక్కి హైడ్రామా..

Uttar Pradesh

Uttar Pradesh

Extramarital Affair: ముగ్గురు పిల్లల తల్లి భర్తకు తెలియకుండా ఓ యువకుడితో 7 ఏళ్లుగా వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. తీరా ఈ విషయం భర్తకు తెలియడంతో విద్యుత్ స్తంభం ఎక్కి హైడ్రామాకు తెరతీసింది. ఈ ఘటన బుధవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది. 34 ఏళ్ల సుమన్ దేవీ అనే మహిళకి అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏడేళ్లుగా కొనసాగుతున్న ఈ వివాహేతర సంబంధం భర్త రామ్ గోవింద్‌కి తెలిసింది.

Read Also: Terrorists Arrest: యూపీలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్..

అయితే, సదరు యువకుడిని తమ ఇంట్లోనే పెట్టుకుందామని, దీంతో తమ ఆర్థిక సమస్యలను కూడా తీరుస్తాడని భర్తతో చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. రామ్ గోవింద్ సుమన్ ఆలోచనల్ని వ్యతిరేకిస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. భర్త తన ప్రతిపాదనకు అంగీకరించపోవడంతో ఆత్మహత్యా ప్రయత్నంలో భాగంగా మహిళ హై ఓల్టేజ్ విద్యుత్ స్తంభాన్ని ఎక్కింది. భర్త తన వివాహేతర సంబంధాన్ని అంగీకరించకపోవడంతో ఇంతకుముందు కూడా చాలా సార్లు ఆత్మహత్య ప్రయత్నాలకు పాల్పడింది.

ప్రస్తుతం మహిళ విద్యుత్ స్తంభం ఎక్కి బెదిరిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఆమెను కిందకు దింపేందుకు స్థానిక అధికారులు, పోలీస్ సిబ్బంది, విద్యుత్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేయడంతో మహిళకు ప్రాణాపాయం తప్పింది. మహిళను కిందకు దింపేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు ఆమెను ఒప్పించి కిందకు దింపారు.

Exit mobile version