NTV Telugu Site icon

UP Teacher: మహిళా టీచర్‌ని “ముద్దు” కోరిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. వీడియో వైరల్..

Up Teacher

Up Teacher

UP Teacher: ఉత్తర్ ప్రదేశ్‌లో ఉపాధ్యాయుల కోసం తీసుకువచ్చని డిజిటల్ హాజరు వ్యవస్థను ఆసరాగా చేసుకుని ఓ ఉపాధ్యాయుడు, తన తోటి మహిళా టీచర్‌ని ‘‘ముద్దు’’ కోరడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన యూపీ ప్రభుత్వం డిజిటర్ అటెండెన్స్ వ్యవస్థను నిలుపుదల చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, హాజరు వేసేందుకు మహిళా టీచర్‌ని తన చెంపపై ముద్దు పెట్టాలని కోరుతున్నట్లు కనిపిస్తోంది.

Read Also: Stock market: రుచించని ఆర్బీఐ పాలసీ.. నష్టాల్లో ముగిసిన సూచీలు

మహిళా టీచర్ అటెండెన్స్ మార్క్ చేయడానికి బదులుగా అతను ఆమెను ముద్దు అడగటం వీడియోలో కనిపిస్తుంది. ఇందులో ఉపాధ్యాయుడు తనకు చాలా సరదాగా ఉందని, తన షరతుకు అంగీకరిస్తే మహిళా టీచర్‌కి అంతా సులువుగా మారుతుందని చెప్పడం వినొచ్చు. మహిళా టీచర్ డిజిటర్ హాజరును కూడా తానే చూసుకుంటానని చెప్పాడు. ఏ కండీషన్ అని మహిళా టీచర్ అడగగానే, అతను తన చెంపను చూపించి ముద్దు కావాలని అని అడుగున్నట్లు ఉంది. దీనికి తాను అంగీకరించనని ఆమె చెప్పింది. ఇదంతా డర్టీ వర్క్ అని చెప్పింది. దీనికి సమాధానంగా సదరు ఉపాధ్యాయుడు నవ్వడం వీడియోలో కనిపించింది.

దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా టీచర్ సరిగా స్పందించలేదని, అతను చెంపదెబ్బ అడుగుతున్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో, ప్రభుత్వం ఈ హాజరు వ్యవస్థను నిలిపేసింది. ఉపాధ్యాయ సంఘాల సభ్యులతో సమావేశమైన అనంతరం ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 8న హాజరు విధానాన్ని ప్రకటించినప్పటి నుంచి ఉపాధ్యాయులు దీనిని వ్యతిరేకిస్తున్నారని, ముందుగా ప్రభుత్వం అన్ని స్థాయిల్లో దీనిని ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. హాజరు విధానాన్ని అమలు చేసే ముందు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం వంటి ఇతర దీర్ఘకాలిక డిమాండ్లను కూడా నెరవేర్చాలని పట్టుబట్టారు.