కొడుకు ఓ ఇంటివాడవుతున్నాడు అంటే ఏ తండ్రికైనా ఎంత సంతోషం ఉంటుంది. అంతేకాదు వధూవరులు కూడా ఆనందంగా ఉంటే.. ఇరు కుటుంబాలకు ఇంకెంత సంతోషం. ఇలాంటి దృశ్యమే రాధికా మర్చంట్ ఇంట ఆవిష్కృతమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో ఉప్పొంగిపోయారు. అలాంటి సంతోషకరమైన సమయంలో ముఖేష్ అంబానీ ఒకింత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖేష్-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ వేడుకలు గత కొద్ది రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఆయా కార్యక్రమాలతో సందడి.. సందడిగా సాగుతున్నాయి. అయితే ముందస్తు వేడుకల్లో భాగంగా రాధికా మర్చంట్ కుటుంబం గృహ శాంతిపూజను నిర్వహించింది. పూర్వీకులను గౌరవించుకోవడం, నవగ్రహారాధన ఈ పూజ యొక్క ఉద్దేశం. ఈ సందర్భంగా కాబోయే వధూవరులిద్దరూ దండలు మార్చుకున్నారు. ఈ వేడుకల్లో కొత్త జంట ఉల్లాసంగా కనిపించారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరికున్న ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. అనంతరం పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సన్నివేశాన్ని చూసిన ముఖేష్ అంబానీ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. రాధిక తల్లిదండ్రులు కూడా అలానే కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇక పెళ్లి కూతురు రాధిక సంప్రదాయ వస్త్రాల్లో ధగ ధగ మెరిసిపోయింది. పెళ్లికూతురు ముస్తాబులో కనిపించడంతో రాధిక చూడముచ్చటగా కనిపించింది. మార్చిలో ప్రీవెడ్డింగ్ వేడుకలు జరగ్గా.. ఇక శుక్రవారం రాత్రికి పెళ్లితో ఈ జంట ఒక్కటవుతుంది. ఈ వేడుకలు కూడా దాదాపు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ముంబైలో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: IPS officer Sunil Kumar: వివాదంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్..
ఇక ఈ వివాహ వేడుకలకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారు. ఆయా కంపెనీల సీఈవోలు, రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా సినీ గ్లామర్ పెళ్లిలో తళుక్కుమని మెరవబోతుంది.