Sadhvi Prachi: స్వరా భాస్కర్ పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి “ఫ్రిజ్” చూడాల్సింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sadhvi Prachi On Swara Bhasker Marriage: బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ ఇటీవల సమాజ్ వాదీ పార్టీ నేత ముస్లిం అయిన ఫహద్ అహ్మద్ ను పెళ్లి చేసుకుంది. దీనిపై ఇటు హిందూ, అటు ముస్లిం వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది ముస్లిం మతపెద్దలు ఈ వివాహాన్ని తప్పుబట్టారు. ఇదిలా ఉంటే హిందూ నేతలు కూడా స్వరా తీరును విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వివాహం గురించి విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచీ కాలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Teachers Affair: టీచర్ల వివాహేతర సంబంధం.. ఫోన్ కాల్‌తో అడ్డంగా బుక్
Also Read
స్వరాభాస్కర్ హిందూ మతానికి వ్యతిరేకి అని.. ఆమె తన మతానికి చెందిన వారిని కాదని పెళ్లి చేసుకుంటుందని అనుకున్నానని.. ఇప్పుడు అది జరిగిందని, ఓ ముస్లింను వివాహం చేసుకుందని సాధ్వీ ప్రాచీ అన్నారు. శ్రద్ధా వాకర్ ను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా చంపి, 35 ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో పెట్టాడని.. స్వరా భాస్కర్ కు కూడా ఇదే గతి పట్టవచ్చని అన్నారు. శ్రద్ధా వాకర్ విషయాన్ని స్వరాభాస్కర్ పట్టించుకోలేదని.. పెళ్లి వంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఫ్రిజ్ చూసి ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించారు. పెళ్లి ఆమె వ్యక్తిగతం, నేను పెద్దగా చెప్పడానికి ఏం లేదు, కానీ శ్రద్ధకు జరిగిందే స్వరాకు జరగవచ్చని సాధ్వీ ప్రాచీ అన్నారు.
ఇదిలా ఉంటే స్వరా భాస్కర్, ఫహాద్ ను పెళ్లి చేసుకోవడం లీగర్ కావచ్చు, కానీ ఇస్లామిక్ కాదని చికాగోకు చెందిన ఓ ఇస్లామిక్ పండితుడు వ్యాఖ్యానించాడు. విగ్రహారాధన చేసే స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని ఖురాన్ చెబుతోందని.. ఒక వేళ పెళ్లి కోసమే స్వరా భాస్కర్ ఇస్లాంలోకి చేరితే దాన్ని అల్లా అంగీకరించడని వ్యాఖ్యానించాడు. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ మాట్లాడుతూ స్వరా భాస్కర్ ఇస్లాంను అంగీకరించకుండా ఫహద్‌ను వివాహం చేసుకోలేరని అన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!