దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాల జాబితాను విడుదల చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Kuppam: మారనున్న కుప్పం రూపురేఖలు.. సీఎం ఆదేశాలతో అభివృద్ధి వైపు వేగంగా అడుగులు..!
రానున్న మూడు రోజులు అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే జూలై 16న (మంగళవారం) గుజరాత్‌లో అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. అలాగే వచ్చే మూడు రోజుల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, నాగాలాండ్, కేరళ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Hardik Pandya Viral Video: అనంత్ అంబానీ పెళ్లిలో హార్దిక్ వీడియోపై చర్చ..ఇంతకీ ప్యాండ్యా ఏమి ఆర్డర్ చేశారు..?
ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక శిబిరాల్లో లక్షలాది మంది ఆశ్రయం పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: IND vs ZIM: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. బౌలర్ ఎంట్రీ