ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది… ఓవైపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. మరోవైపు జాతీయ భద్రతాసలహాదారు అజిత్ దోవల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో జరుగుతోన్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.. మరోవైపు విపక్షాలు అభ్యర్థిని ఖరారు చేశాయి..
-
కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ
రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు అధికార పక్షం సిద్ధం అయ్యింది.. దాని కోసం కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది.. పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరి, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఉన్నారు.. ఈ సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్టు తెలుస్తుండగా.. ఆ తర్వాత ఎన్డీఏ పక్షాలతో మాట్లాడి అధికారిక ప్రకటన చేయనున్నారు..
-
బీజేపీ అభ్యర్థిపై రాత్రికి క్లారిటీ..!
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరు అనే అంశంపై ఈ రోజు రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది... అయితే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఆయననే అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే ఛాన్స్ ఉంది.. ఇక, వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిగా కొనసాగించే అవకాశం ఉందంటున్నారు.
-
విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
రాష్ట్రపతి అభ్యర్థిని ఫైనల్ చేసే పనిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కసరత్తు చేస్తుండగా.. మరోవైపు విపక్షాలు మాత్రం దూకుడు చూపించాయి.. అధికార పార్టీకంటే ముందుగానే విపక్షాలు తమ అభ్యర్థిగా సీనియర్ పొలిటీషియన్ యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశాయి.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా అంటూ అధికారికంగా ప్రకటించాయి.
-
రాష్ట్రపతి అభ్యర్థి అజిత్ దోవల్..?
జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్‌ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.. ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడును మరోసారి అదే పదవిలో కొనసాగిస్తారనే చర్చ సాగుతోంది..