Vegetarian Thali: వెజిటేబుల్ థాలీ ధరలు పెరిగాయి. 7 శాతం ధరలు పెరిగినట్లు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఈ రోజు తెలిపింది. మరోవైపు ఫౌల్ట్రీ ధరలు తగ్గుముఖం పట్టడంతో నాన్-వెజ్ థాలీ ధరలు 7 శాతం తగ్గుముఖం పట్టినట్లు క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలిసిస్ తన నెలవారీ ‘‘రోటీ రైస్ రేట్’’ నివేదికలో పేర్కొంది.
Read Also: Tesla: భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్.. స్థలం కోసం కంపెనీ అధ్యయనం..
రోటీ, కూరగాయాలు(ఉల్లిపాయలు, టొమటోలు, బంగాళాదుంపలు), అన్నం, పప్పు, పెరుగు, సలాడ్‌లతో కూడిన వెజిటేరియన్ థాలీ ధర మార్చిలో ఒక ప్లేట్‌కి రూ. 27.3కి పెరిగింది. ఇది గతేడాది మార్చిలో ఇది రూ. 25.5గా ఉంది. అయితే, ఫిబ్రవరి 2024లో రూ. 27.4తో పోలిస్తే కాస్త చౌకగా మార్చ్ ధరలు ఉన్నాయి. ముఖ్యంగా ఉల్లి, టొమాటో, బంగాళాదుంపల ధరలు వరసగా 40 శాతం, 36 శాతం, 22 శాతం పెరగడంతో థాలీ ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే బియ్యం ధరలు 14 శాతం, పప్పుల ధరలు 22 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
నాన్-వెజ్ థాలీ ధరల విషయానికి వస్తే.. గతేదాడి రూ. 59.2 నుంచి ప్రస్తుతం మార్చిలో రూ. 54.9కి తగ్గింది. ఫిబ్రవరిలో ఇది రూ. 54గా ఉంది. బ్రాయిలర్ ధరలో 16 శాతం తగ్గుదల మాంసాహార థాలీ ధర తగ్గడానికి కారణమైంది. ఫిబ్రవరితో పోల్చినప్పుడు, పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడం మరియు అధిక డిమాండ్ కారణంగా బ్రాయిలర్ ధరలు 5 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది.