Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సెమీహైస్పీడ్ రైలు. ఇప్పటికే 14 రూట్లలో వందేభారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్లే విధంగా ఈ రైళ్లను తయారు చేశారు. అయితే ఇండియాలో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్స్ అంతవేగాన్ని తట్టుకునే అవకాశం లేకపోవడంతో 130 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు. అయితే వందే భారత్ రైలు ప్రారంభం అయిన రెండేళ్లలో రైలు గరిష్ట సగటు వేగం గంటకు 83 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. కేవలం ఒకే రూట్లో మాత్రమే 95 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నట్లు తెలిపింది.
Read Also: Atiq Ahmed: అతిక్ అహ్మద్ హత్య ఎవరికి లాభం.. ఐఎస్ఐ కుట్ర దాగుందా..?
మధ్యప్రదేశ్ కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరడంతో, ఇది వెలుగులోకి వచ్చింది. 2021-22లో వందేభారత్ రైల్ సగటు వేగం 84.48గా ఉండగా, 2022-23లో 81.38 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. రైలుకు వేగంగా వెళ్లే సామర్థ్యం ఉన్న ప్పటికీ ట్రాక్స్ కు దాన్ని తట్టుకునే సామర్థ్యం లేదు. ప్రస్తుతం ఉన్న రైళ్లన్నింటిలో ఢిల్లీ-వారణాసి రైల మాత్రమే సగటున 95 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. ముంబాయి సీఎస్టీ-సాయినగర్ షిర్డీల మధ్య నడుస్తున్న వందే భారత్ రైల్ సగటు వేగం గంటలకు 64 కిలోమీటర్లుగా ఉంది. రాణి కమలాపతి భోపాల్-హజ్రత్ నిజాముద్దీన్ రైలు గంటకు 94 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రాజధాని, శతాబ్ధి రైళ్ల సగటు వేగం కన్నా ఎక్కువగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు.
