NTV Telugu Site icon

Mallikarjun Kharge: గతంలో “వాజ్‌పేయి కూడా ఈ పదాలను అన్నారు”.. నా మాటల్ని ఎందుకు తొలగించారు.

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge: వ్యాపారవేత్త అదానీకి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక పార్లమెంట్ ను కదిపేస్తోంది. బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ టార్గెట్ గా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై లోక్ సభలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఆయన ప్రసంగంలోని కొన్ని పదాలను రికార్డుల నుంచి తొలగించారు. ఆ తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఖర్గే తన వ్యాఖ్యలను ఆరు చోట్ల తొలగించినట్లు చెప్పారు. తన మాటను ఎందుకు తొలగించారని రాజ్యసభ ఛైర్‌పర్సన్‌, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ను ప్రశ్నించారు.

Read Also: Ravi Ashwin: కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్..ఖాతాలో అరుదైన మైలురాయి

నా ప్రసంగంలో ఎవరిపైనా అన్‌పార్లమెంటరీ, నిందారోపణలు ఉన్నాయని నేను అనుకోవడం లేదని అన్నారు. కానీ కొన్ని పదాలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. మీకు ఏదైనా సందేహం ఉంటే వేరే విధంగా అడగవచ్చు కానీ ఆరుచోట్ల పదాలను తొలగించారని ఖర్గే అన్నారు. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహరావుకు వ్యతిరేకంగా ఒక పదాన్ని ఉపయోగించారని.. ఇది ఇప్పటికీ రికార్డుల్లో ఉందని ఖర్గే అన్నారు.

నిన్న లోక సభలో ప్రధాని మోదీ స్పీచ్ పై ఖర్గే స్పందించారు. కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రధాని మోదీ వాస్తవ సమస్యలను దారిమళ్లిస్తూ మాట్లాడారని దుయ్యబట్టారు. అంతకుముందు బుధవారం రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ వ్యవహారంపై విచారణకు మోదీ ఆదేశించలేదని, అదానీని, ప్రధాని రక్షిస్తున్నారంటూ ఆరోపించారు. అదానీ, మోదీ స్నేహితుడు కాకపోతే విచారణకు అంగీకరించాలని, డిఫెన్స్ రంగంలో షెల్ కంపెనీలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.