SBI Bank Robbery: దొంగలు ఏకంగా బ్యాంకునే కొల్లగొట్టారు. అదికూడా 10 అడుగుల పొడైవన సొరంగం తవ్వి మరీ దొంగలు ఆ బ్యాంకును దోచుకున్నారు. ఇకటి కాదు రెండు ఏకంగా కోటి రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. ఈఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సంచలనంగా మారింది.
Read also: Amigos Movie Update : చూపులతో వల వేస్తున్న ‘అమిగోస్’ బ్యూటీ
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో SBI ( స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) భానుతి బ్రాంచ్‌లో దొంగలు పడ్డారు..బ్యాంకు వెనుక భాగం నుంచి 10 అడుగుల మేర సొరంగం తవ్వి బ్యాంకులో చొరబడ్డారు. అంతేకాదు ఈ దుండగులు బ్యాంక్‌లోని గోల్డ్ చెస్ట్‌లోకి ప్రవేశించి కోటి రూపాయలకు పైగా విలువైన 1.8 కిలోల బంగరాన్ని ఎత్తుకెళ్లారు. అక్కడ వున్న క్యాష్ చెస్ట్‌ను బద్దలు కొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో.. బంగారాన్ని మాత్రమే ఎత్తుకెళ్లారు. తాపీగా మరుసటిరోజు ఉదయం బ్యాంకు అధికారులు వచ్చి తలుపులు తీయగానే షాక్ తిన్నారు. బ్యాంక్ లో భారీ సొరంగం మార్గం కనిపించింది.
దీంతో.. బ్యాంకులో చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్న అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే బ్యాంకు వద్దకు వెళ్లి, ఫోరెన్సిక్ అధికారుల సహాయంతో సాక్ష్యాలు సేకరించారు. వీళ్లకు ఎలా వస్తున్నాయి ఇలాంటి ఐడియాలు అంటూ తలపట్టుకుంటున్నారు అధికారులు. నిందితులు ఎవరు? అనేది కనిపెట్టడానికి దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు బ్యాంకు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం నుంచి 4 అడుగుల వెడల్పు.. 10 అడుగుల పొడవుతో సొరంగ మార్గం తవ్వి, బ్యాంకులో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. అయితే.. చోరీ కేసులో కొన్ని వేలిముద్రలు లభించాయన్నారు పోలీసులు. కాగా.. బ్యాంకులో చోరీకి ముందు రెక్కీ నిర్వహించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు పోలీసులు. ఇక, నిందితులకు బ్యాంకు నిర్మాణం.. స్ట్రాంగ్ రూమ్, గోల్డ్ చెస్ట్‌లకు సంబంధించిన వివరాలన్నీ బాగా తెలుసునని.. ఇది బయటి వారి చేసిన పనా.. లేక బ్యాంకు సంబంధిత వర్గాలు చేసిన పనా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
