NTV Telugu Site icon

UP: యోగి సర్కార్‌ తీరుపై ములాయం కోడలు అపర్ణ అలక.. ఎస్పీలో చేరేందుకు ఏర్పాట్లు!

Upbjp

Upbjp

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం నూతన మహిళా కమిషన్‌లో వైస్‌ఛైర్‌పర్సన్‌గా నియమించడంపై ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైస్‌ఛైరన్ పదవి ఇవ్వడంపై ఆమె అలకబూనినట్లు సమాచారం. చైర్‌పర్సన్ పదవి ఆశించి భంగపడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె బీజేపీని వీడనున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇప్పటికే ఆమె సమాజ్‌వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఎస్పీలో చేరవచ్చని సమచారం. మంగళవారమే అపర్ణ.. మహిళా కమిషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

ఇది కూాడా చదవండి: Actor Darshan Case: ‘‘నా కొడుకు పట్టిన గతే దర్శన్‌కి పట్టాలి’’.. రేణుకాస్వామి తల్లిదండ్రులు..

అపర్ణా యాదవ్‌ ఛైర్‌పర్సన్ పదవిని ఆశించారు. కానీ వైస్‌ చైర్‌పర్సన్ పదవి దక్కింది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై బీజేపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమె పార్టీ మారుతున్నారన్న వార్తల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు అపర్ణా యాదవ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి బేబీ రాణి మౌర్య.. అపర్ణతో మాట్లాడి ఆమెను శాంతింపజేస్తున్నట్లు సమాచారం. బేబీ రాణి మౌర్య యూపీలో మహిళా సంక్షేమం మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. మహిళా కమిషన్ ఈ విభాగం కిందకే వస్తుంది. బేబీ రాణి మౌర్య మాట్లాడుతూ.. పదవిలో పూర్తి అధికారం మరియు స్వేచ్ఛ ఉంటుందని అపర్ణతో చెప్పారు. బేబీ రాణి మౌర్య హామీ ఇచ్చినప్పటికీ అపర్ణా యాదవ్ పదవిని చేపట్టడానికి సిద్ధంగా లేనున్నట్టు సమాచారం. పోస్ట్ తన స్థాయికి తగ్గట్టుగా లేదని ఆమె బదులిచ్చినట్లు తెలుస్తోంది.

ఇది కూాడా చదవండి: Maharashtra: ఎంతటి విషాదం.. భుజాలపై బిడ్డల శవాలతో 15 కి.మీ నడక.. వైరల్ అవుతున్న వీడియో..

Show comments