NTV Telugu Site icon

Uttar Pradesh: ఆలయంలోకి చెప్పులతో వెళ్లిన అధికారిపై తీవ్ర విమర్శలు.. ఆ తర్వాత సస్పెండ్..!

Up

Up

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలో ఆలయ నిబంధనలు విస్మరించిన ఒక అధికారిపై సస్పెండ్ అయ్యాడు. అయితే, వింధ్యవాసిని ఆలయంలోనికి పాదరక్షలు ధరించి వచ్చిన అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (అగ్రికల్చర్)ను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు పడింది. దేవాలయంలో పాదరక్షలు ధరించిన ఏడీఓను చూసిన భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఆలయంలో ఏడీఓ బూట్లు ధరించి ఉండడం చూసిన ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా అతనిపై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న జిల్లా మెజిస్ట్రేట్ సదరు ఏడీఓను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.

Read Also: Hyderabad: గచ్చిబౌలి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఫ్రిడ్జ్ లో పాడైన కూరగాయలు

అయితే, విద్యవాసిని ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయంలో అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన ఏడీఏ ప్రతీక్ కుమార్ సింగ్ షూష్‌తో సహా లోపలికి ప్రవేశించారు. ఇది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో జిల్లా మేజిస్ట్రేట్ ప్రియాంక నిరంజన్ ఆదేశాల మేరకు ప్రతీక్ కుమార్ సింగ్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక, ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా మాట్లాడుతూ.. చెప్పులు ధరించి, గుడి మెట్లు ఎక్కుతున్న అధికారిని తాను చూసి ఆలయంలో నుంచి బయటకు పంపించి వేశానని చెప్పుకొచ్చారు.